రేపు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు జరగనుంది.
ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు.
దీనిలో భాగంగా రేపు హైదరాబాద్లో మద్యం దుకాణాలు మూసివేయాలని పోలీస్ కమిషనర్ సందీప్ శాండీల్యా ఆదేశాలు జారీ చేశారు.