లవ్ జిహాదీ అనేది ముందుగా కేరళ రాష్ట్రంలో బయటపడింది. మతం పేరుతో హిందూ అమ్మాయిలను ఓ వర్గానికి చెందినటువంటి వారు ట్రాప్ లో పడేసి మత మార్పిడి చేయడం ప్రధాన లక్ష్యంగా సాగుతూ ఉందని ఆరోపణలు వచ్చాయి.
అయితే లవ్ కి లవ్ జిహాద్ కి మధ్య చాలా తేడా ఉంటుంది. లవ్ చేసుకునే సమయంలో ప్రేమ అనేది కులాన్ని మతాన్ని చూసి పుట్టదు కానీ ప్రేమించుకున్న తర్వాత పెళ్లి అనే విషయం వచ్చినప్పుడు మతం మారితేనే పెళ్లి చేసుకుంటానని మతం మారకపోతే పెళ్లి చేసుకొని చెప్పడంలోనే అసలైన ఆంతర్యం దాగి ఉంది.
ప్రేమించే సమయంలో ఇలాంటి అడ్డంకులు ఉండవు. అప్పుడు అంతా సవ్యంగానే ఉందని అనిపిస్తుంది. కానీ పెళ్లి అనే అంశం తెరపైకి వచ్చినప్పుడు ఒక వర్గానికి చెందిన అమ్మాయి కానీ అబ్బాయి కానీ మతమార్పిడి జరిగితేనే పెళ్లి చేసుకుంటాను అని చెప్పడం ఇక్కడ అసలైన నేరం. దాన్ని లవ్ జిహాద్గా పరిగణించవచ్చు.
ఏ మతమైనా ఏ కులమైనా ప్రేమించుకునే సమయంలో లేనటువంటి నిబంధనలు పెళ్లి అనే సమయంలోనే ఎందుకొస్తున్నాయి. ఒకవేళ పెళ్లి సమయంలో రానప్పటికీ పెళ్లి అయిన తర్వాత కచ్చితంగా మా విధానాలు మా పద్ధతులు ఇది అని కావాలని మతమార్పిడి చేస్తున్నట్టు ఎన్నో కేసులు బయటకు వచ్చాయి.
కచ్చితంగా పెళ్లయింది కాబట్టి మారాల్సిందేనని భావించి కొంతమంది మారుతున్నారు. కొంతమంది ఇష్టం లేకున్నా కూడా ఆ మత మార్పిడి జరగడం వల్లనే లవ్ జిహాద్ కేసులు బయటకు వచ్చాయి. లవ్ కు లవ్ జిహాదుకు చాలా తేడా ఉంటుంది. లవ్ అనేది మతాన్ని మారమని కులాన్ని మారమని ఎప్పుడూ చెప్పదు. కానీ లవ్ జిహాద్ అంటే కచ్చితంగా మతాన్ని మార్చేందుకు కుట్రగా అభివర్ణిస్తున్నారు. కాబట్టి దీని అర్థం చేసుకొని యువత సన్మార్గంలోనే ప్రయాణిస్తే ఇలాంటి ఘటనలు జరగవు.