spot_img
Monday, March 23, 2026
spot_img

లివ్ ఇన్ రిలేషన్’.. ప్రియురాలిని దారుణంగా హత్య చేసిన ప్రియుడు..

ప్రేమ పేరుతో సహజీవనం చేస్తున్నారు. పెళ్లి కాకుండా ఒకే ఇంట్లో ఉంటూ..దానికి ‘లివ్ ఇన్ రిలేషన్’ అనే పేరు కూడా పెట్టుకుంటున్నారు. అయితే.. ఇది కొంత వరకు బాగానే ఉన్నప్పటికీ.. కొందరు యువతులు మాత్రం పలు కారణాలతో హత్యలకు గురవుతున్నారు. గతంలో ఢిల్లీలో శ్రద్ధా వాకర్ అనే యువతి హత్య సహజీవనం ఎంత ప్రమాదకరమో నిరూపించింది. ఇప్పుడు మరోసారి అలాంటి ఘటనే జరిగింది. లివ్ ఇన్ రిలేషన్‌లో ఉన్న ఓ జంట.. ప్రియురాలు తనతో సెక్స్‌కి నిరాకరించిందని దారుణంగా హత్య చేశాడు ప్రియుడు. మధ్యప్రదేశ్ ఇండోర్‌లో జరిగిన ఈ దారుణ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

నిఖితా (20) అనే యువతికి గుణ జిల్లాకు చెందిన ప్రవీణ్ సింగ్ ధాకడ్ (24)తో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయం ఏర్పడింది. వీరి పరిచయం కాస్త ప్రేమగా మారడంతో నగరంలోని ఓ ఇంటిని అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలోనే యువతి తనతో సెక్స్‌కి నిరాకరించిందని ప్రియుడు కోపంతో నిఖితా మెడపై కత్తెరతో అతి దారుణంగా పొడిచాడు. తీవ్ర రక్తస్రావంతో యువతి అక్కడికక్కడే మృతి చెందింది. భయాందోళనకు గురైన నిందితుడు ఇంటికి తాళం వేసి, ఆమె మొబైల్ తీసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు. అయితే.. డిసెంబర్ 7న రావూజీ బజార్ ప్రాంతంలో యువతి హత్య జరగ్గా.. రెండు రోజుల తర్వాత అంటే డిసెంబర్ 9న మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అడిషనల్ డీసీపీ అభినయ్ విశ్వకర్మ తెలిపారు. కాగా.. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని వెతికే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img
- Advertisment -spot_img

Most Popular