చేతిలో ఒక యూట్యూబ్ ఛానల్ లోగో… దర్జాగా పోలీస్ స్టేషన్లో ఎంట్రీ… ఎస్ఐల తో మాటామంతి ఇది సాధారణ విషయంగానే అనిపించవచ్చు. కానీ రిపోర్టర్ అని చెప్పుకునే ఆ బందు ( పేరు మార్చాం) వాస్తవంగా నాలుగు పోలీస్ స్టేషన్లకు కలెక్టర్గా వ్యవహరిస్తున్నాడు అంటే సీను అర్థం చేసుకోవచ్చు. వెస్ట్ జోన్ లో కీలకమైన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్, అదే పేరిట ఉన్న ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, మధురానగర్ పోలీస్ స్టేషన్, ఎస్సార్ నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ల పరిధిలో ఉన్న పబ్ లు, బార్లు, మసాజ్ సెంటర్లు, ట్రాఫిక్ ఉన్న షాపింగ్ మాల్స్ నుంచి భారీగా మామూళ్ళు వెళ్లాల్సిందే. సంబంధిత సెక్టార్ ఎస్ఐలు నేరుగా కలెక్షన్స్ చేయలేరు. దానికోసం వారు బందును ఎంచుకున్నారు. ఆయా పోలీస్ స్టేషన్లలో తమ సెక్టార్ లో ఉన్న కలెక్షన్ పాయింట్ల గురించి ఆ బందుకు చెప్పి బంధు ద్వారా కలెక్షన్స్ తెప్పించుకుంటున్నారు. కొన్ని నెలల నుంచి సాగుతున్న ఈ తతంగం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో వారిపై నిఘా పెట్టారు. ప్రత్యేక బృందాల ద్వారా విచారణ చేపట్టగా అసలు విషయాలు వెలుగు లోకి వచ్చాయి. ఉన్నతాధికారులు క్రమ శిక్షణ చర్యలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
వసూళ్లలో రాబందు సెక్టార్ ఎస్ఐలకు బందు వెస్ట్ జోన్ లో ‘బందు’ లీలలు
RELATED ARTICLES