spot_img
Monday, March 23, 2026
spot_img

వాట్సాప్ చాట్ చూపిస్తే కోర్టు నమ్ముతుందా? చట్టం ఏమంటోంది?

వాట్సాప్ చాట్స్, స్క్రీన్‌షాట్‌లు చాలా వివాదాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. అయితే, వాట్సాప్ స్క్రీన్‌షాట్‌ను నేరుగా కోర్టులో సాక్ష్యంగా అంగీకరిస్తారా అంటే సమాధానం లేదు.సెక్షన్ 65B సర్టిఫికేట్ ఎందుకు తప్పనిసరి?

వాట్సాప్ చాట్స్ లేదా స్క్రీన్‌షాట్‌లను కోర్టులో సమర్పించాలంటే సెక్షన్ 65B సర్టిఫికేట్ తప్పనిసరి. ఈ సర్టిఫికేట్ ద్వారా ఆ డిజిటల్ సాక్ష్యం నిజమైనదని, మార్పులు చేయలేదని, ఉపయోగించిన మొబైల్ లేదా కంప్యూటర్ సరిగా పనిచేసిందని చట్టపరంగా నిర్ధారిస్తారు. ఈ సర్టిఫికేట్ లేకుండా సమర్పించిన స్క్రీన్‌షాట్‌ను కోర్టు సాధారణంగా అంగీకరించదు. అందుకే డిజిటల్ సాక్ష్యాల విషయంలో చట్టపరమైన విధానాలు పాటించడం చాలా ముఖ్యం.

కోర్టులో సాక్ష్యంగా నిలవాలంటే ఏం చేయాలి?

వాట్సాప్ స్క్రీన్‌షాట్ కోర్టులో బలమైన సాక్ష్యంగా నిలవాలంటే సరైన ఫార్మాట్‌లో ప్రింట్ తీసుకోవాలి. దానికి సంబంధించిన 65B సర్టిఫికేట్‌ను బాధ్యత కలిగిన వ్యక్తి ద్వారా జారీ చేయించాలి. అవసరమైతే ఫోరెన్సిక్ పరీక్షల ద్వారా స్క్రీన్‌షాట్ ప్రామాణికతను కూడా నిరూపించాలి. ఈ విధంగా అన్ని నిబంధనలు పాటిస్తేనే వాట్సాప్ డిజిటల్ సాక్ష్యం కోర్టులో చెల్లుబాటు అవుతుంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img
- Advertisment -spot_img

Most Popular