spot_img
Monday, March 23, 2026
spot_img

వాలెంటైన్ వీక్ కు ముందు ఘోరం.. ప్రియుడి చేతిలో మోసపోయి సూసైడ్ చేసుకున్న యువతి..

ప్రస్తుతం యువత ఎక్కువ మంది ప్రేమ వివాహలకు మొగ్గు చూపిస్తున్నారు. ప్రేమలో ఒకరి ఆలోచనలు మరోకరితో పంచుకుంటారు.అదే విధంగా ఇష్టాలు, బాధలు, ఓపెన్ గా మాట్లాడుకుంటారు. ఇద్దరు కలిసి కొన్నిరోజుల పాటు జర్నీ చేస్తారు కాబట్టి.. జీవితంలో ఎలా ఉండాలనే దానిపై ఒక ఐడియాకు వస్తారు. చాలా మంది తమతో పనిచేసే లేదా తెలిసిన వారితో ఎక్కువగా ప్రేమల పడుతున్నారు.

ముఖ్యంగా సాఫ్ట్ వేర్ కంపెనీలలో అయితే మరీ ఎక్కువగా ఈ కల్చర్ ఉంటుంది. అయితే.. నిజాయితీగా ప్రేమించే వాళ్లు చాలా తక్కువ మంది ఉంటారని చెబుతుంటారు. కొందరు.. అమ్మాయిలు కానీ, అబ్బాయిలు కానీ తమ అవసరాల కోసం అవతలివారిని ప్రేమించినట్లు నటిస్తారు. తీరా అవసరం తీరిపోయాక ముఖం చాటేస్తారు. మరికొందరైతే ఇంకా దుర్మార్గంగా.. ఒకరికి తెలియకుండా మరికొందరితో ప్రేమాయణాలు కొనసాగిస్తుంటారు.

కానీ ఇలాంటి పరిస్థితులలో కొందరు అమ్మాయిలు కానీ, అబ్బాయిలు కానీ సెన్సిటివ్ గా ఉంటారు. అవతలివారు తమను మోసం చేశారని తెలిస్తే భరించలేరు. ఆవేశంలో హత్యలు చేయడం లేదా ఆత్మహత్యలకు పాల్పడటానికి కూడా వెనుకాడరు. అచ్చం ఇలాంటి ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.

నర్సీ పట్నానికి చెందిన టెకీ రుత్తల రత్నమాధురి, విశాఖకు చెందిన శేఖర్ ఆరేళ్లుగా ప్రేమించుకున్నారు. ఇద్దరు ఒకే కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నారు. బాధితుల ప్రకారం.. అయితే.. మొదట శేఖర్ , రత్న మాధురికి ప్రపోజ్ చేశాడు. ఈ క్రమంలో యువతి ఒప్పుకుంది. ఆరేళ్లుగా వీరి ప్రేమ కొనసాగింది. అయితే.. రత్నమాధురిని, శేఖర్ తో గత నెల 27న విశాఖకు తీసుకెళ్లాడు. ఆతర్వాత .. ఏంజరిగిందో కానీ.. అదే రోజు రాత్రి మరల రత్నను తీసుకొచ్చి నర్సీపట్నంకు దింపేసి వెళ్లాడు. అప్పటి నుంచి యువతి తీవ్ర అస్వస్థతకు గురైంది.

యువతి కుటుంబ సభ్యులు వెంటనే.. నర్సీపట్నం ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచిర మరల విశాఖ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ గత తొమ్మిదిరోజులుగా ట్రీట్మెంట్ ను అందించారు. రత్న విపరీతంగా డిప్రెషన్ కు లోనైనట్లు ఆమెకుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఈ క్రమంలో ఆమె తొమ్మిదిరోజుల తర్వాత తుదిశ్వాస విడిచింది. ఈ క్రమంలో యువతి కుటుంబ సభ్యులు తమ కూతురుని మాయ మాటలతో మోసం చేసి, విషప్రయోగం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాలెంటైన్స్ వీక్ కు ఒకరోజు ముందు ఈ ఘటన వెలుగు చూడటం అందరిని కంటతడి పెట్టిస్తుంది

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img
- Advertisment -spot_img

Most Popular