విదేశీ ఉద్యోగాల మాయలో చిక్కుకున్న ఒక తెలుగు యువకుడు ప్రాణభయంతో సహాయం కోసం గోడు వెళ్లబోసుకున్నాడు.
ఉద్యోగం ఇస్తామంటూ ఏజెంట్లు తనను వియత్నాంలోకి తీసుకెళ్లి, అక్కడ సైబర్ క్రైమ్ కార్యకలాపాల్లో బలవంతం చేశారని ఆ బాధితుడు తెలిపాడు. మోసపోయానని గ్రహించిన వెంటనే అక్కడి నుండి తప్పించుకొని, ప్రస్తుతం గుర్తు తెలియని చోట ప్రాణ భయంతో దాక్కుని ఉన్నానని కన్నీళ్లు పెట్టుకున్నాడు.
తన పరిస్థితిని వివరిస్తూ Fearless Journalist తో మాట్లాడుతూ –
👉 “ఉద్యోగం ఇస్తామని నమ్మించి మోసం చేశారు. ఇప్పుడు నన్ను సైబర్ నేరాలకు వాడుకుంటున్నారు. నా ప్రాణం ప్రమాదంలో ఉంది. దయచేసి నన్ను కాపాడండి” అని వాపోయాడు.
ఈ ఘటన మరోసారి విదేశీ ఉద్యోగాల పేరుతో జరుగుతున్న మోసాలపై అవగాహన అవసరాన్ని గుర్తు చేస్తోంది.
విదేశీ ఉద్యోగం పేరుతో మోసం వియత్నాంలో , లావుస్ ఇరుక్కున్న యువకుడి ఆవేదన frearless journalist exclusive విడియో
RELATED ARTICLES