వివేకా హత్య కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి సంచలన వ్యాఖ్యలు చేశాడు… వివేకా హత్య కేసులో సీబీఐ ఎస్పీ రాంసింగ్ తనను కొట్టి తీవ్ర ఒత్తిడి చేసి అప్రూవర్ గా మార్చారని చెప్పాలని జైల్లో ఉన్న నన్ను ప్రలోభాలకు గురిచేశారని ఆరోపించారు… 20 కోట్లు అడ్వాన్స్ కింద తీసుకోవాలని ఈ హత్య కేసులో కీలక నిందితుడు ఉన్న దేవి రెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడు చైతన్య రెడ్డి తన జైల్లో ప్రలోభాలు గురి చేసినట్లు తెలిపాడు..
వివేకా హత్య కేసు… రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన హై ప్రొఫైల్ కేస్ … ఈ కేసులో అప్రూవల్ గా మారిన దస్తగిరి వైసీపీ ప్రభుత్వం పై సంచలన వ్యాఖ్యలు చేశాడు… వచ్చే ఎన్నికల్లో రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నానని దస్తగిరి వెల్లడించాడు .తాను పులివెందులలోని సీఎం జగన్ మోహన్ రెడ్డి పై పోటీ చేయడానికి సిద్ధంగా ఉండాలని తెలిపాడు.. ఇక వివేకా హత్య కేసులో సిబిఐ కోర్టు ముందు విచారణకు హాజరు కాకపోవడంతో గత విచారణ లో అప్రూవల్ గా మారిన దస్తగిరికి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది సీబీఐ కోర్ట్… దీంతో దస్తగిరి నాంపల్లి సీబీఐ కోర్ట్ కు వ్యక్తిగతంగా విచారణకు హాజరయ్యాడు… ఇక వివేకా హత్య కేసులో వైసీపీ నేతలు ఎంపీ అవినాష్, రెడ్డి ,దేవి రెడ్డి శివ శంకర్ రెడ్డి, మనోహర్ రెడ్డి భయభ్రాంతులకు గురి చేసేలా వ్యవహరిస్తున్నారు అంటూ వ్యాఖ్యలు చేశాడు…
వైసీపీ ప్రభుత్వం తనను భయభ్రాంతులకు గురిచేస్తోందని,
తనకు వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశాడు… జగన్ మోహన్ రెడ్డి, అవినాశ్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, మనోహర్ రెడ్డిల పేర్లను దస్తగిరి ప్రస్తావించాడు. ఇక
సీబీఐ ఎస్పీ రామ్ సింగ్ తనను కొట్టారని, తనపై ఒత్తిడి తెచ్చి అనేక విషయాలు చెప్పిస్తున్నారని వివేకా పీఏ కృష్ణారెడ్డి ఎలా ఆరోపణలు చేశాడో, నన్ను కూడా అలాగే చెప్పమని ప్రలోభాలకు గురి చేస్తున్నారని మీడియా ముందు తెలిపాడు…ఇది రాజకీయంగా ఎంతో ప్రాధాన్యం ఉన్న కేసు కాబట్టి జగన్ కు వివేకా చిన్నాన్న అయినందున ఆయనకు ఎఫెక్ట్ ఎక్కువ ఉందంట… ఓట్లు పడని పరిస్థితి అంట… అందుకే నాకు డబ్బు ఆఫర్ చేశారని తెలిపారు…
ఓ కిడ్నాప్ కేసులో నన్ను అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన సమయంలో దేవి రెడ్డి శివ శంకర్ రెడ్డి కుమారుడు చైతన్య రెడ్డి డాక్టర్ ముసుగులో జైల్ లోపలకు వచ్చాడని, చైతన్యరెడ్డి ఓ డాక్టర్ లా జైలులో పేషెంట్లను చూడ్డానికి వచ్చి ప్రలోభాలకు గురిచేసినట్లు తెలిపాడు… 20 కోట్ల రూపాయలు అడ్వాన్స్ కింద తీసుకోవాలంటూ ప్రలోభాలకు గురి చేసాడంటూ దస్తగిరి ఆరోపించాడు..
వివేక హత్య కేసు రెండు తెలుగు రాష్ట్రాలను సంచలనమైనది.. ఆ కేసును నీరు గారిచే ప్రయత్నాలు కొనసాగుతున్నాయనే అనుమానం వ్యక్తం చేశాడు…వైసీపీ ప్రభుత్వం పై ఈ హత్య కేసు ప్రభావం చూపుతోందని తనని ప్రలోభాలకు గురి చేస్తున్నారని ఆరోపించాడు…తెలంగాణ పోలీసులతో తనకు భద్రత కావాలని కోర్టును ఆశ్రయిస్తానని తెలిపాడు.. ఏపీ పోలీసులపై నాకు నమ్మకం లేదని దీంతో తెలంగాణ పోలీస్ ద్వారా భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరాడు…ఇక పులివెందలో అరెస్ట్ అయిన వ్యవహారంపై సీబీఐ అధికారులకు అన్ని వివరాలను వెల్లడించినట్లు తెలిపాడు… తనని ప్రలోభాలకు గురిచేసిన వారి వివరాలన్నీ సిబిఐ అందించానని తెలిపాడు..ఎం
పూర్తిస్థాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని సీబీఐ ని కోరినట్లు దస్తగిరి వెల్లడించాడు…ఇక నాకు 2 + 2 గన్మెన్లు ఉన్నప్పుడు నేను ఎలా కిడ్నాప్ చేస్తాను ,నాకు ఎస్కార్ట్ వెహికల్ కూడా ఉందని గుర్తు చేశాడు..
కక్షపూరితంగానే నాపైన కిడ్నాప్ కేసు పెట్టి జైలు పంపించారని ఆరోపించాడు… ఈ వ్యవహారంపై సిబిఐ కోర్టు, సీబీఐ అధికారులు పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపి తనకు న్యాయం చేయాలని కోరాడు…
రాజకీయంగా ఆంధ్రప్రదేశ్లో వివేక హత్య కేసు ద్వారా ఎఫెక్ట్ అవుతామని భావిస్తున్నారు .. గతంలో విచారణ కు హాజరూ కాకపోవడం తో తనపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసినందున ,తాను వ్యక్తి గతంగా విచారణకు హాజరైనట్లు తెలిపాడు…
ఇక దస్తగిరి అరెస్టు కాకుండా సిబిఐ కోర్టులో రీకాల్ పిటిషన్ వేశాడు. అయితే దస్తగిరి వేరే కేసులో జైల్లో ఉన్నందున విచారణ కి రాలేక పోయానని తన అభ్యర్థనను పరిగణలోకి తీసుకోవాలని కోర్ట్ ను అభ్యర్థించాడు.. దీంతో రీ కాల్ పిటిషన్ ను సీబీఐ కోర్ట్ అనుమతించింది… ఇక ఈ హత్య కేసులో దస్తగిరి మరో పిటిషన్ ను కూడా సీబీఐ న్యాయ స్థానం లో గతం లో దాఖలు చేశాడు.. ఈ హత్య కేసులో తాను అప్రూవర్ గా మారినందున తనని నిందితుడు గా కాకుండా సాక్షిగానే పరిగణనలోకి తీసుకొనేలా సీబీఐ కి ఆదేశాలు ఇవ్వాలని కోరాడు… దీంతో పిటిషన్ ను విచారణ జరిపిన న్యాయస్థానం తదుపరి విచారణను మార్చి 6 కు వాయిదా వేసింది.. ఇక వివేకా హత్య కేసులో నిందితుడు కడప ఎంపీ అవినాష్ రెడ్డి విచారణకు హాజరు కాగా, జ్యూడిషియల్ రిమాండ్ లో ఉన్న గంగిరెడ్డి, భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి శివ శంకర్ రెడ్డి, ఉమా శంకర్ రెడ్డి, ఉదయ్ కుమార్, సునీల్ యాదవ్ ను కోర్ట్ ముందు హాజరు పరిచారు.. తదుపరి విచారణ మార్చ్ 12 కి వాయిదా వేసింది న్యాయస్థానం..