కాకినాడ జిల్లా సామర్లకోట (Samarlakota Triple Murder)లో ఆగస్టు 3వ తేదీన జరిగిన తల్లి, ఇద్దరు పిల్లల హత్యలు కలకలం రేపాయి. భర్త డ్యూటీకి వెళ్లి ఉదయాన్నే ఇంటికి వచ్చేసరికి ముగ్గురూ రక్తపు మడుగులో పడి ఉండటంతో అతనికి నోట మాట రాలేదుఅటు భార్య తరపు బంధువులకు, ఇటు తన తల్లిదండ్రులకు సమాచారమిచ్చిన భర్త దనుప్రసాద్.. మృతదేహాల వద్ద మౌనంగా రోధించిన తీరు అందరిచే కంటతడి పెట్టించింది. చక్కగా సాగిపోతున్న సంసారంలో ఇంతటి దారుణం జరగడంతో అందరూ షాక్ కు గురయ్యారు. ముగ్గురి హత్యలపై కేసు నమోదు చేసిన పోలీసులు.. వారి శరీరాలపై బంగారు ఆభరణాలు మిస్సవ్వడంతో తొలుత దొంగల పనై ఉంటుందని భావించారు. కానీ విచారణలో.. హత్యలకు వివాహేతర సంబంధమే ప్రధాన కారణంగా తేలింది.
ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించిన పోలీసులు ములపర్తి మాధురి (34), కూతుర్లు పుష్పకుమారి అలియాస్ నిస్సీ (8), ప్రైజీ జెస్సీ (6)ల హత్యలకు సంబంధించిన వివరాలను తాజాగా వెల్లడించారు. ఎస్పీ బిందుమాధవ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఘటనా ప్రాంతాన్ని పరిశీలించాక తెలిసిన వారే హత్యలకు పాల్పడి ఉంటారని భావించారు. ఆ దిశగా దర్యాప్తు చేయగా.. డేల్ సురేష్ అనే వ్యక్తిపై అనుమానం వచ్చింది. కాల్ డేటా పరిశీలించగా ఇద్దరికీ పరిచయం ఉందని, ఇద్దరి మధ్య 1044 కాల్స్ ఉన్నాయని తెలిపారు. వాళ్లు హత్యకు గురైన రాత్రి సురేష్ 200 మీటర్ల దూరంలో చాలాసేపు వెయిట్ చేసినట్లు మొబైల్ లొకేషన్ చూపించిందన్నారు. దీంతో ఈ హత్యల వెనుక సురేష్ హస్తం ఉందన్న నిర్థారణకు వచ్చారు. అనంతరం సురేష్ ను అరెస్ట్ చేయగా.. వివాహేతర సంబంధమే హత్యలకు కారణమని తేలింది.
లారీ డ్రైవర్ గా పనిచేస్తున్న సురేష్ కు.. మాధురితో రెండేళ్లుగా వివాహేతర సంబంధం (Extra Marital Affair) ఉందని, ఆమెకు, ఆమె కుటుంబానికి సుమారుగా రూ.7 లక్షలు ఖర్చు చేసినట్లు విచారణలో చెప్పాడని ఎస్పీ తెలిపారు. ఆ రోజు రాత్రి మాధురిని కలిసేందుకు వెనుక డోర్ నుంచి వెళ్లిన సురేష్ తో గొడవ జరిగింది. తనకు బంగారం, వాషింగ్ మెషీన్ కొనివ్వాలని అడగడంతో సురేష్ ఆమె తలపై కర్రతో కొట్టాడు. ఆ శబ్దానికి పిల్లలు లేచి చూడటంతో ప్రత్యక్ష సాక్షులు అవుతారని వారిని కూడా చంపినట్లు సురేష్ విచారణలో వెల్లడించాడు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూస్తామని ఎస్పీ తెలిపారు..
వీడిన సామర్లకోట ట్రిపుల్ మర్డర్ మిస్టరీ.. వివరాలు వెల్లడించిన ఎస్పీ
RELATED ARTICLES