బెంగళూరులో తన భర్త, పిల్లలను చంపేస్తానని బెదిరించి హనీట్రాప్ చేయించారని ఓ మహిళ ఆరోపన కాంట్రాక్టర్లపై బెదిరింపులు, అలాగే అత్యాచారం, హనీట్రాప్ కేసులు ఎదుర్కొంటూ అరెస్టయిన రాజరాజేశ్వరి నగర బీజేపీ ఎమ్మెల్యే మునిరత్న తనను వాడుకుని ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులను హనీట్రాప్ చేయించారని అమే మహిళ ఆరోపించింది
ఈ మహిళపై అత్యాచారం కేసులోనే మునిరత్న అరెస్టయ్యారు. ఆమె బుధవారం నగరంలో మీడియాతో మాట్లాడుతూ సంచలన ఆరోపణలు చేశారు. తనకు భద్రత కల్పిస్తే, మాజీ సీఎం హనీట్రాప్ విషయాలను సిట్‌కు అందజేస్తానని తెలిపారు. మునిరత్న తనలాగే చాలామంది మహిళలను హనీ ట్రాప్ కు వాడుకున్నారని, తనకు మొబైల్ ఫోన్ ఇచ్చి సదరు వ్యక్తుల వద్దకు పంపించేవారని చెప్పారు. మునిరత్న బంధువు సుధాకర్ కూడా హనీట్రాప్ దందాలో పాల్గొనేవాడని చెప్పారు మునిరత్న బెదిరించి తనతో హనీ ట్రాప్ చేసిన సాక్ష్యాధారాలు అన్నీ ఉన్నాయని, తాను సొంతంగా ఎవరినీ ట్రాప్ చేయలేదని ఆమె చెప్పారు. ఆయన మాజీ సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలను హనీట్రాప్ చేసి వీడియో తీశారని, ఏసీపీ, సీఐ కూడా హనీట్రాప్ చేయించారని తెలిపారు. హెచ్‌ఐవీ జబ్బు కలిగిన యువతిని రాజకీయ నేతల వద్దకు పంపేవారని, 10 నిమిషాలు సమయం ఇస్తే బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బీవై.విజయేంద్రను కలిసి మునిరత్న అక్రమాలను వివరిస్తానని, ఆయనను ఇంకా పారీ్టలో ఎందుకు కొనసాగిస్తున్నారని ధ్వజమెత్తారు. మునిరత్న మంత్రిగా ఉండగా ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడ్డారో కొన్ని ఫోటోలను ఆమె విడుదల చేశారు.
హనీ ట్రాప్ వీడియోల ద్వారా అప్పటి సీఎంలను బెదిరించి మంత్రి పదవి పొందారని అన్నారు. నాకు ఏమైనా జరిగితే మునిరత్న కారణమన్నారు. అత్యాచారం ఫిర్యాదు వెనక్కి తీసుకోవాలని బెదిరింపులకు పాల్పడ్డారని, దీనిపై పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టానన్నారు. తనకు రక్షణ కలి్పంచాలని కోరారు.అమే అభ్యర్థన పై పోలీసులు ఎలా స్పందిస్తారు అమే ఆరోపణల పై పోలీసులు విచారణ చేస్తే అనేక విషయాలు బైటికి వచ్చే అవకాశం ఉంది