spot_img
Monday, September 29, 2025
spot_img

వీడు భర్త కాదు రాక్షసుడు.. అరేయ్ తమ్ముడు ఈ సారి రాఖీ కట్టలేనేమో.. పెళ్లైన 6నెలలకే

అంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా ఉయ్యూరులో దారుణం చోటు చేసుకుంది. పెళ్ళైన ఆరు నెలలకు వివాహిత ఆత్మహత్య చేసుకుంది. 24 ఏళ్ల శ్రీ విద్యా ఎంఎస్సీ చదువుకుని ఓ ప్రైవేటు కళాశాలలో లెక్చరర్ గా పని చేస్తుంది.భర్త ఉయ్యూరు మండలం కలవపాముల గ్రామంలో విలేజ్ సర్వేయర్‌గా పని చేస్తున్నాడు. అయితే.. పెళ్ళైన నెల రోజుల నుంచే రాంబాబు శ్రీవిద్యను వేధింపులకు గురి చేయడం మొదలుపెట్టాడు. అందరి ముందు హేళనగా మాట్లడటంతోపాటు.. దారుణంగా కొట్టి.. చిత్రహింసలకు గురిచేసేవాడు.. ఇన్ని నెలలు రాంబాబు వేధింపులను మౌనంగా భరిస్తూ వస్తున్న శ్రీవిద్యా ఇంట్లో వాళ్లకు చెప్పుకుని బాధపడేది.. ఈ క్రమంలోనే రాంబాబు వేధింపులు తీవ్రమవ్వడంతో ఇంట్లో ఎవ్వరు లేని సమయంలో శ్రీ విద్య ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలసీులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి వివరాలు సేకరించారు. అనంతరం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శ్రీ విద్యా తల్లి తండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.. అయితే.. శ్రీ విద్య ఆత్మహత్య కేసులో విచారించే కొద్ది సంచలన అంశాలు వెలుగులోకి వచ్చాయి. భర్త రాంబాబు వ్యవహార శైలి, తన ప్రవర్తించిన తీరుపై సూసైడ్ నోట్ రాసి మరి శ్రీ విద్య ఆత్మహత్య చేసుకుంది.. తన భర్త.. కిరాతకుడని.. ఎలా పడితే అలా కొట్టే వాడని పేర్కొంది.

కన్నీరు పెట్టిస్తున్న శ్రీ విద్యా సూసైడ్ నోట్

”నా భర్త పెట్టే చిత్రహింసలు భరించలేకపోతున్నాను.. జుట్టు పట్టుకొని మంచాని కి వేసి కొడుతుండడంతో తలంతా నొప్పిగా ఉంది. రేపు రాఖీ పండుగకు ఉండనేమో.. నాన్నంటే నాకు ధైర్యం.. ఈ స్థితికి కారణమైన భర్త, అతని కుటుంబ సభ్యులను ఎట్టి పరిస్థితుల్లో వదల వద్దు.. అంటూ సూసైడ్ నోట్ లో రాసింది..

Suicide Note

అంతేకాకుండా ఓ అమ్మాయి ముందు నేను పనికిరాను అంటూ రాంబాబు హేళనగా మట్లాడాడు.. ఆ అమ్మాయి ముందు చేసిన హేళన, జ్ఞాపకాలు మరిచి పోలేకపోతున్నా.. రోజు తాగి నన్ను హింసిస్తున్నాడు.. నా తలను మంచానికి వేసి కొట్టి, వీపుపై పిడిగుద్దులు గుద్దాడు. మంచిగా వుండటమే నేను చేసిన తప్పా అమ్మా .. నన్ను నాన్నను ప్రతిసారీ తిడుతున్నాడు.. నేను పేపర్ కరెక్షన్స్ చేస్తుంటే తీసుకొని ఎగరవేశాడు.. ఆ పేపర్స్ తీసుకెళ్ళి కాలేజీ వారికి ఇచ్చేయండి.. అరేయ్ తమ్ముడు జాగ్రత్త. ఈ సారి నేను నీకు రాఖీ కట్టలేనేమో.. అమ్మ, నాన్నను జాగ్రత్తగా చూసుకో.. తమ్ముడు.. అంటూ సూసైడ్ నోట్ రాసిన శ్రీ విద్యా బలవన్మరణానికి పాల్పడింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular