spot_img
Monday, September 29, 2025
spot_img

వెనుక నుంచి వచ్చి స్కూల్ విద్యార్థినికి బలవంతంగా ముద్దు పెట్టిన దుండగుడు ..సీసీ Cam వీడియో తో సహా

ఇంటి నుంచి బయటకు వెళ్లిన అమ్మాయి.. తిరిగి క్షేమంగా ఇంటికి చేరేవరకు వారి తల్లిదండ్రులు ఆందోళన పడుతూనే ఉంటారు. పిల్లల భద్రత గురించి తల్లిదండ్రులు నిత్యం కంగారు పడే రోజులు తయారయ్యాయి. ఎక్కడ చూసినా ఆఢపిల్లలపై లైంగిక దాడులు జరుగుతున్నాయి. వారితో అసభ్యకరంగా ప్రవర్తించడం, లైంగిక దాడులకు తెగబడటం.. ఈ తరహా ఘటనలు పెరిగిపోయాయి

తాజాగా ఓ స్కూల్ విద్యార్థినికి చేదు అనుభవం ఎదురైంది. స్కూల్ నుంచి ఇంటికి వెళ్తున్న సమయంలో ఆ బాలికను ఓ యువకుడు వెనుక నుంచి వచ్చి బలవంతంగా ముద్దు పెట్టుకున్నాడు. అంతేకాదు ఆ అమ్మాయి బుగ్గపై కొరికాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఓ అమ్మాయి 6వ తరగతి చదువుతోంది. స్కూల్ అయిపోయాక ఇంటికి వెళ్తోంది. ఇంతలో దారిలో ఊహించని ఘటన జరిగింది. బాలికను ఫాలో అవుతూ వచ్చాడో ఓ యువకుడు. ఆమె వెనకాల పరిగెతూ వచ్చాడు. సడెన్ గా బాలికను వెనుక నుంచి గట్టిగా పట్టుకున్నాడు. ఆ తర్వాత బుగ్గపై ముద్దు పెట్టాడు. బుగ్గను కొరికాడు కూడా. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. అతడి చర్యతో బాలిక బాగా భయపడిపోయింది. గట్టిగా కేకలు వేస్తూ ఏడ్చేసింది. యువకుడు బాలికను ఫాలో కావడం, బలవంతంగా ముద్దు పెట్టుకోవడం, ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోవడం ఇదంతా సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ షాకింగ్ ఘటన బంగ్లాదేశ్ లో జరిగినట్లుగా తెలుస్తోంది. వీడియో ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నారు. బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. కాగా, అతడి మానసిక స్థితి బాగోలేదని అతడి తల్లిదండ్రులు చెబుతున్నారు. దీనికి సంబంధించి అతడికి చికిత్స అందిస్తున్నట్లు వివరించారు.ఏది ఏమైనా ఆడపిల్లకు రక్షణ కరువు కావడం ఆందోళన కలిగించే అంశం. ఇంటి నుంచి బయటకు వెళ్లిన అమ్మాయి తిరిగి క్షేమంగా ఇంటికి చేరుకునే వరకు తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన పరిస్థితులు ఉన్నాయి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular