spot_img
Tuesday, March 24, 2026
spot_img

శంషాబాద్ ఎయిర్పోర్టులో మలయాలను నటుడు వినాయకన్ అదుపులోకి తీసుకున్న సిఐఎస్ఎఫ్ అధికారులు..

గత ఏడాది మద్యం మత్తులో సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ పై దాడి చేసిన మలయాళ నటుడు వినాయకన్

సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈరోజు ఉదయం శంషాబాద్ విమానాశ్రయంలో నటుడు వినాయకన్

అదుపులోకి సిఐఎస్ఎఫ్ అధికారులు

అనంతరం పోలీసుల అప్పజెప్పి సిఐఎస్ఎఫ్ అధికారులు

మలయాళ వినాయకన్.నటుడు నీ విచారిస్తున్న ఆర్జిఐ ఎయిర్పోర్ట్ పోలీసులుఎయిర్పోర్టులో సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ ని వినాయకన్ కొట్టినట్టు తెలుస్తోంది. స్వతహాగా మళయాళ సినీ పరిశ్రమలో ఎక్కువ సినిమాలు చేసిన వినాయకన్ రజినీకాంత్ నటించిన జైలర్ సినిమా లో వర్మ పాత్రతో పాపులర్ అయ్యాడు. ఇక మద్యం మత్తులో ఉన్న వినాయకన్ కానిస్టేబుల్ పై దాడి చేసినట్లు ఫిర్యాదు అందింది. దీంతో వినాయకన్ ను అదుపులోకి తీసుకొని ఆర్.జి.ఐ పోలీసులకు సీఐఎస్ఎఫ్ అప్పగించినట్టు తెలుస్తోంది. మరోపక్క మద్యం మత్తులో ఉండి తమపై దాడి చేశారని అధికారులు కూడా ఫిర్యాదు చేశారు. ఇక గత ఏడాది అక్టోబర్ 23న కూడా దురుసు ప్రవర్తనతో వినాయకన్ అరెస్ట్ అయ్యాడు. ఇక కొచ్చిన్ లో సినిమా షూటింగ్ ముగించుకుని గోవా కనెక్టింగ్ ఫ్లైట్ కోసం హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో వెయిటింగ్ లో ఉన్న సమయంలో వినాయకన్ దాడి చేసినట్టు చెబుతున్నారు. ఇక వినాయకన్ ప్రస్తుతానికి గోవాలో సెటిల్ అయినట్టు తెలుస్తోంది. ఇక వినాయకన్ ను అదుపులోకి తీసుకుని ఆర్జిఐ పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img
- Advertisment -spot_img

Most Popular