spot_img
Thursday, February 5, 2026
spot_img

శాలరీ రూ.8 వేలు.. జీఎస్టీ బకాయిలు రూ.13 కోట్లు.. ఏదో మతలబే ఉందని అకౌంట్ బ్లాక్ చేసిన అధికారులు !

చేసేది చిన్న జీతం .8 వేల జీతం ఉన్న చిన్న తరగతి ఉద్యోగికి 13 కోట్ల రూపాయల జీఎస్టీ బకాయిలు ఉండటం ఆశ్చర్యానికి గురించి చేసింది. బకాయిలు చెల్లించకపోవడంతో అకౌంట్ క్లోజ్ చేశారు జీఎస్టీ అధికారులు.ఇంత చిన్న ఉద్యోగికి అంత జీఎస్టీ ఏంటి.. ఏదో మతలబే ఉందని.. తమిళనాడులో వైరల్ గా మారింది ఈ ఘటన.

వివరాల్లోకి వెళ్తే.. వెల్లూర్ జిల్లాలోని గుడియతమ్ ఏరియాలోని నగల్ ప్రాంతానికి చెందిన మహాలింగం కార్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. అతని భార్య యశోద ప్రైవేట్ షూ కంపెనీలో నెలకు రూ.8 వేల శాలరీకి పనిచేస్తుంటుంది.

ఇటీవలే ఆమెకు శాలరీ పడిందని విత్ డ్రా చేసుకోవడానికి భర్త ఏటీఎం కు వెళ్తే.. చేదు అనుభవం ఎదురైంది. అకౌంట్ లో బ్యాలెన్స్ లేనట్లుగా చూయించింది. దీంతో డబ్బులు విత్ డ్రా చేసుకోవడం కుదరలేదు. హోం బ్యాంక్ కు వెళ్లి వివరణ అడిగారు.బ్యాంక్ అకౌంట్ చెక్ చేసిన బ్యాంక్ సిబ్బంది చెప్పిన సమాధానం విని షాక్ కు గురయ్యారు ఆ దంపతులు. మీరు 13 కోట్ల రూపాయల జీఎస్టీ కట్టాలి.. అందుకే అకౌంట్ ఫ్రీజ్ చేసినట్లు చెప్పడంతో షాక్ తిన్నారు. చెన్నైలో ఉన్న జీఎస్టీ ఆఫీస్ కు వెళ్లాల్సింగా సూచించారు సిబ్బంది. దీంతో జీఎస్టీ ఆఫీస్ కు వెళ్లినప్పటికీ.. పరిష్కారం లభివంచకపోవడంతో షాక్ కు గురయ్యారు. నెల జీతం తీసుకునే పరిస్థితి లేదని.. ఏం చేయాలో తోచడం లేదని పేర్కొన్నారు.

కొన్ని సార్లు అధికారుల తప్పిదాల వలన ఇలాంటి ఘటనలు జరుగుతుంటాయి. సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు పేర్కొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular