spot_img
Monday, March 23, 2026
spot_img

సదరు మహిళవ్యక్తితో చేసిన చాటింగ్‌ ఆధారంగాహైదరాబాద్‌కు చెందిన మహిళ పెట్టిన రేప్‌ కేసును సుప్రీంకోర్టు కొట్టేసింది. 

గ్రీన్‌కార్డ్‌ హోల్డర్‌ను పెళ్లి చేసుకునేందుకు ఓ మహిళ ఎత్తుగడ ఆమె అసలు రూపాన్ని గ్రహించి పెళ్లికి నిరాకరించిన యువకుడు అతడిపై రేప్‌ కేసు పెట్టిన మహిళపెళ్లి పేరు చెప్పి తనను మోసం చేశాడంటూ ఒక వ్యక్తిపై హైదరాబాద్‌కు చెందిన మహిళ పెట్టిన రేప్‌ కేసును సుప్రీంకోర్టు కొట్టేసింది. సదరు మహిళ ఆ వ్యక్తితో చేసిన చాటింగ్‌ ఆధారంగా.. ఆమె తీవ్ర లైంగిక ధోరణలు కలిగి ఉందని, మోసపూరిత, కక్షపూరిత ధోరణి కలిగి ఉందనే విషయం స్పష్టంగా అర్థమవుతోందని తీవ్ర వ్యాఖ్యలు చేసిన ధర్మాసనం… అలాంటి ఆమెతో పెళ్లి విషయంలో అతడు వెనక్కితగ్గడంలో తప్పేమీ లేదని తేల్చిచెప్పింది. సదరు మహిళ.. అతడు తనను పెళ్లి పేరుతో ఒకసారి లైంగికంగా వాడుకున్నాడంటూ తొలుత సైబరాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేసి ఒక కేసు పెట్టింది. తర్వాత కొంతకాలానికి.. 4-5సార్లు తనను రేప్‌ చేశాడని.. పెళ్లి చేసుకోవాలని అడిగితే తనది తక్కువ కులమంటూ దూరం పెట్టాడని ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద మరో కేసు పెట్టింది. ఆమె ఫిర్యాదు ఆధారంగా తనపై దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేయాలంటూ అతడు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా కోర్టు అందుకు నిరాకరించింది. దీంతో అతడు సుప్రీంకోర్టుకు వెళ్లాడు. 2021లో సైతం ఆమె ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన ఒక అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌పై ఇదే తరహా ఫిర్యాదు చేసిన విషయం సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లాడు. అక్కడ జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌, జస్టిస్‌ సందీప్‌ మెహతాతో కూడిన ధర్మాసనం ఈ వ్యాజ్యాన్ని విచారించింది.

విచారణలో భాగంగా ఆమె అతడితో చేసిన వాట్సాప్‌ సంభాషణలను, ఇతరత్రా సందేశాలను పరిశీలించిన ధర్మాసనం.. తనను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించినవారిపై క్రిమినల్‌ కేసులు పెడతానంటూ బెదిరించే లక్షణం ఆమెకు ఉందని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ”అవతలి వ్యక్తులు తమంత తామే తనను వదిలేసేలా చికాకుపెడతానన్న విషయాన్ని ఆమే ఒక చాట్‌లో స్వయంగా అంగీకరించింది. తన వ్యక్తిగత లాభం కోసం వ్యక్తులను లక్ష్యంగా చేసుకోవడం గురించి కూడా ఆమె మాట్లాడింది. తానొక గ్రీన్‌కార్డ్‌ హోల్డర్‌ కోసం చూస్తున్నానన్న విషయం కూడా చెప్పింది. ఒకదశలో.. మరో వ్యక్తిని ట్రాప్‌ చేయడం తనకు అంత కష్టమేమీ కాదని కూడా చెప్పింది. ఈ చాట్‌లన్నీ ఆమె ప్రవర్తనకు సంబంధించిన చేదు వాస్తవాలకు అద్దం పడుతున్నాయి” అని వ్యాఖ్యానించింది. ఆమె ధోరణిని చూశాక ఆమెతో పెళ్లిని అతడు వద్దనుకోవడంలో న్యాయం ఉందని అభిప్రాయపడింది. రెండోసారి ఆమె ఫిర్యాదు చేశాక అతడిపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద రెండో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడం పట్ల కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అతడిపై ఇంకా కిమ్రినల్‌ ప్రొసీడింగ్స్‌ను కొనసాగించడమంటే.. న్యాయప్రక్రియను దుర్వినియోగం చేయడమేనని తేల్చిచెప్పింది. అతడిపై ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేసిన అభియోగాలు అబద్ధాలు, దురుద్దేశంతో కూడినవి, కల్పితాలు, ఆధారరహితమైనవని స్పష్టం చేస్తూ.. ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేసింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img
- Advertisment -spot_img

Most Popular