ఖార్ఖాన, యాంటీ నార్కోటిక్ బ్యూరో(Anti Narcotic Bureau) పోలీసులు కలిసి డ్రగ్స్ వినియోగిస్తున్న 8మంది విద్యార్థులను అదుపులోకి తీసుకున్నట్లు నార్త్ జోన్ డీసీపీ రష్మి పెరుమాళ్( North Zone DCP Rashmi Perumal ) తెలిపారు.గంజాయి, ఓజీ, ఎల్ఎస్డీ వినియోగిస్తున్న పెడ్లర్లు.. స్టూడెంట్స్‌కు సైతం అమ్ముతున్నట్లు గుర్తించామన్నారు. నగరంలో మత్తుపదార్థాలు సప్లై చేసినా, వినియోగించినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
డ్రగ్స్ తీసుకున్నారో లేదో రెండు నిమిషాల్లో కనిపెడతాం..
మత్తుపదార్థాల విషయంలో నగరంలోని అన్ని కాలేజీలపైనా ఫోకస్ పెట్టినట్లు యాంటి నార్కోటిక్ బ్యూరో ఎస్పీ సాయి చైతన్య చెప్పారు. డ్రగ్స్ తీసుకునే వారిపై కఠిన చర్యలుంటాయని ఆయన హెచ్చరించారు. నూతనంగా తెచ్చిన డ్రగ్స్ డిటెక్టివ్ పరికరాలతో మత్తుపదార్థాలు తీసుకున్నారా లేదా అనే విషయం రెండు నిమిషాల్లో కనిపెడతామని వెల్లడించారు. యాజమాన్యాలు ఫీజులు తీసుకుని కాలేజీలు నడపడమే కాకుండా.. డ్రగ్స్ ఉన్నాయా లేదా అనేది ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని సూచించారు. మత్తుపదార్థాల నిర్మూలనకు కాలేజీలు చర్యలు తీసుకోకుంటే వారికి నోటీసులు ఇస్తామని హెచ్చరించారు. 100కిలోల పైన గంజాయి పట్టించిన వారికి రూ.2లక్షల రివార్డు కూడా ఇస్తున్నట్లు ఎస్పీ సాయి చైతన్య చెప్పారు.
వంద కిలోల కంటే ఎక్కువ గంజాయికి సంబంధించిన సమాచారం అందజేస్తే రూ.2లక్షల నజరానా ఇస్తామని ప్రకటించారు. ఫోన్ నంబర్ 87126 71111, సామాజిక మాధ్యమాల ద్వారా వివరాలు తెలియజేయాలన్నారు.