spot_img
Monday, September 29, 2025
spot_img

సహస్త్ర హత్య కేసు చేధనలో కీలకంగా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఇచ్చిన క్లూ ఎవరు చంపారో తేలింది

సహస్రను హత్య చేసిన బాలునిది ఆంధ్రప్రదేశ్‎లోని ఒంగోలు జిల్లా. రెండేళ్ల క్రితం సహస్ర ఇంటి పక్కన భవనంలోకి వచ్చారు బాలుడి ఫ్యామిలీ. సహస్ర కుటుంబ సభ్యులతో బాలుడు ఫ్యామిలీకి పరిచయం ఉంది. సహస్ర పుట్టినరోజు నాడు బాలికకు కేక్ కూడా తినిపించాడు నిందితుడు. సహస్రకు నిందితుడు కేక్ తినిపించిన ఫొటో ప్రస్తుతం వైరల్‎గా మారింది.

ఇలా సహస్ర ఫ్యామిలీ గురించి మొత్తం వివరాలు తెలియడంతో వాళ్ల ఇంట్లో చోరీ చేయాలని ఫిక్స్ అయ్యాడు. ఇందుకు ముందే పక్కా ప్లాన్ వేసుకుని.. స్ర్కిప్ట్‎ను ఒక పేపర్ పై రాసుకున్నాడు. ఫస్ట్ ఇంట్లోకి ఎలా వెళ్లాలి.. చోరీ ఎలా చేయాలి.. దొంగతనం చేసిన తర్వాత ఎలా బయటపడాలి.. ఒకవేళ చోరీ చేస్తూ దొరికిపోతే ఎలా తప్పించుకోవాలి అని మొత్తం ముందే ప్లాన్ చేసుకున్నాడు.స్కెచ్ ప్రకారం వెళ్లాడు.. దొంగతనం చేశాడు. కానీ అప్పుడు ఇంట్లో ఒంటరిగా ఉన్న సహస్ర దొంగతనం చేయడం చూసి అడ్డుకుంది. సహస్ర చూడటంతో తన చోరీ విషయం ఎక్కడ బయటపడుతుందోనని బాలుడు బయపడ్డాడు. దీంతో థెఫ్ట్ ప్లాన్‎ను కాస్తా మర్డర్ ప్లాన్‎గా మార్చాడు. ప్లాన్ బీలో భాగంగా ముందుగా సహస్ర గొంతు నులిమి చంపాడు.

చనిపోయిందో లేదో అనే అనుమానంతో వెంట తీసుకుపోయిన కత్తితో సహస్ర గొంతు కోశాడు. అయినప్పటికీ చనిపోయిందో లేదో అనే భయంతో కత్తితో విచక్షణరహితంగా సహస్రపై దాడి చేసి పారిపోయాడు. ఒకవేళ సహస్ర దొంగతనాన్ని అడ్డుకోకుంటే చోరీ అనంతరం ఇంట్లో గ్యాస్ లీక్ చేసి బ్లాస్ట్ చేసి పారిపోవాలని స్కెచ్ వేశాడు బాలుడు.

కానీ సహస్ర చూడటంతో ప్లాన్ మొత్తం రివర్స్ అయ్యింది. చోరీ ప్లాన్ కాస్తా.. హత్యకు దారి తీసింది. 10వ తరగతి చదువుతోన్న బాలుడి ఇంతా క్రూరంగా ఒక హత్య చేశాడని తెలియడంతో స్థానికులంతా ఒక్కసారిగా భయాందోళనకు గురి అయ్యారు. బాలుడే సహస్రను అంతమొందించాడని తెలియడంతో.. ఆమె పుట్టిన రోజు నిందితుడు కేక్ తినిపించినా ఫొటో చూసి.. కేక్ తినిపించినా చేతులతోనే దారుణంగా పొడిచి చంపాడని మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.నాలుగు రోజులైనా మర్డర్ మిస్టరీ వీడకపోవడంతో పోలీసులు ఛేదిస్తారా చేతులెత్తేస్తారా అన్న అనుమానాలు బలంగా వినిపించాయి. ఈ క్రమంలో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఇచ్చిన హింట్‌ కీలకంగా మారింది. సహస్ర హత్య జరిగిన రోజు సాఫ్ట్‌వేర్ ఉద్యోగి వర్క్‌ ఫ్రమ్‌ హోం చేశాడు. ఇంట్లో ఉంటూనే బయట ఏం జరుగుతుందో యథాలాపంగా గమనించాడు. అప్పుడు కంటపడ్డాడో బాలుడు. దాక్కుంటూ వెళ్తూనే.. సజ్జపైన లెటర్‌ పెట్టాడు. అదే విషయాన్ని పోలీసులకు పూసగుచ్చినట్టు వివరించాడు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. ఈ మాత్రం క్లూతో పక్క బిల్డింగ్‌లో కుర్రాడ్ని అదుపులోకి తీసుకున్నారు. ఏం చేశావ్‌.. ఎందుకిలా చేశావ్‌ అని ప్రశ్నించారు. ముందుగా బుకాయించిన బాలుడు.. ఆ తర్వాత క్రైమ్ సీన్ మొత్తం రివీల్ చేశాడు.

చూడ్డానికి కుర్రాడే.. టెన్త్‌ క్లాస్ చదువుతున్న వాడే.. బట్.. అతని ఆలోచన విధానం చూస్తే మైండ్ బ్లాంక్ అవుతోంది.. పట్టుమని పదిహేనేళ్లు కూడా లేవు… ఇన్ని క్రిమినల్ ఆలోచనలా..? అన్న విస్మయం కలుగుతుంది. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఇచ్చిన సమాచారంతో బాలుడ్ని అదుపులోకి తీసుకుని విచారించారు పోలీసులు. ముందుగా లెటర్‌ గురించి ఆరాతీశారు. ఆపై దబాయించి ప్రశ్నిస్తే.. నమ్మలేని నిజాలు బయటపడ్డాయ్‌. బాలుడి క్రిమినల్‌ బ్రెయిన్‌ చూసి పోలీసులు అవాక్కయ్యారు. ఎందుకంటే,.. ముందే పేపర్‌పై స్క్రిప్ట్‌ రాసుకుని ఇంట్లోకి చొరబడ్డాడు. నిందితుడి ఇంట్లో హత్యకు ఉపయోగించిన కత్తి, రక్తంతో తడిచిన దుస్తులు, ముందే రాసుకున్న లెటర్‌ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు..బాలుడి క్రిమినల్ బ్రెయిన్ ఎలా ఉందో ఓసారి తెలుసుకుందాం. దానికి అతను పెట్టుకున్న పేరు మిషన్‌ థెఫ్ట్‌. కాకపోతే అది అనుకోకుండా.. మిషన్ మర్డర్‌గా మారింది. సహస్ర ఇంటి పక్కనే ఉంటాడు బాలుడు. వాళ్లింట్లో ఎవరెవరు ఉంటారు..? ఎప్పుడెప్పుడు పేరెంట్స్ ఆఫీస్‌కి వెళ్తారో అంతా గమనించాడు. ఆ తర్వాత ప్లాన్ వేసుకున్నాడు. మనసులో ఏం అనుకున్నాడో.. దాన్ని ఎలా అమలు చేయాలో ఓ అంచనాకు వచ్చాడు.

step 1: గో టు హోమ్‌.. అంటే చోరీ కోసం ముందే ఇంటిని సెలెక్ట్‌ చేసుకోవడం.. ఎలా వెళ్లాలో ప్లాన్‌ చేసుకోవడం

step 2: టేక్‌ గ్యాస్‌ అండ్‌ టేబుల్‌.. ఇంటికి వెళ్లాక టేబుల్‌ చూసుకోవడం.. లాక్‌ పగలగొట్టడానికి గ్యాస్‌కట్టర్‌ని రెడీ చేసుకోవడం

step 3: ఫైర్‌ ద గ్యాస్‌.. గ్యాస్‌కట్టర్‌ను వెలిగించడం

step 4: కీప్‌ లాక్‌ ఆన్‌ ద గ్యాస్‌.. గ్యాస్‌కట్టర్‌తో లాక్‌ను పగలగొట్టడం

step 5: కట్‌ విత్ నైఫ్.. ఆ తర్వాత కత్తితో లాక్‌ను కట్‌ చేయడం

step 6: ఆఫ్టర్‌ కటింగ్‌ టేక్‌ మనీ.. ఇంట్లోకి వెళ్లి మనీ దొంగతనం చేయడం

step 7: లాక్‌ ఫర్‌ హోమ్‌… ఆ తర్వాత ఇంటికి లాక్‌ చేయడం

step 8: లీక్‌ ద గ్యాస్‌.. ఇంటికి లాక్‌ వేసేముందు గ్యాస్‌ లీక్‌ చేయడం

step 9: కమ్‌ ఔట్‌ హోమ్‌.. ఇంట్లోకి బయటికి రావడం…

step 10: లాక్‌ ద హోమ్‌… ఇవన్నీ ఆర్డర్‌లో లేనపోయినా.. ఇదే రాసుకున్నాడు

సింపుల్‌గా చెప్పాలంటే.. ఇంట్లోకి వెళ్లాలి.. మనీ తీసుకోవాలి.. గ్యాస్‌ లీక్‌ చేయాలి.. బయటికి వచ్చేయాలి.. ఇదీ, ఈ కుర్రాడి చోరీ ప్లాన్‌ గ్యాస్ లీక్ చేసి పెంట్‌హౌస్‌ పేల్చేయాలన్న ప్లాన్!

దొంగతనం చేయడం ఒక ఆలోచన అయితే.. గ్యాస్ లీక్‌ చేసి ఆ ఇంటిని పేల్చేయాలన్నది మరో ఆలోచన. ఎటు చూసినా తన పాత్ర బయటకు పొక్కకూడదని చాలా తెలివిగా వ్యవహరించాడు. మరోవైపు సీసీ కెమెరాలు ఎక్కడెక్కడ ఉన్నాయి.. అందులో ఏమేం కవర్ అవుతాయో కూడా గ్రహించాడు. అందుకే పోలీసులు ఎన్నిసార్లు సీసీ ఫుటేజ్‌ తిరగేసినా బాలుడి ఆనవాళ్లు ఎక్కడా కనిపించలేదు. ఓ దశలో పోలీసుల దర్యాప్తు క్లిష్టంగా మారింది. ఎంతమంది స్థానికుల్ని, అనుమానితుల్ని అదుపులోకి తీసుకుని విచారించినా ఉపయోగం లేకుండాపోయింది. బట్.. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఇచ్చిన క్లూ మర్డర్ మిస్టరీ ఛేదించారు పోలీసులు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular