spot_img
Monday, March 23, 2026
spot_img

సైఫ్ అలీఖాన్‌పై దాడి చేసిన నిందితుడు అరెస్ట్.. ఎందుకు దాడి చేశాడు

బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ పై కత్తితో దాడిచేసి తీవ్రంగా గాయపర్చి పరారీలో ఉన్న నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ముంబై బాంద్రా పోలీసులు అతన్ని అరెస్టు చేసారు.నిందితుడు ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తుంది. దాడి జరిగిన 33 గంటల్లోనే పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. సైఫ్ అలీఖాన్ ఇంట్లోకి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది.. దొంగతనానికి వెళ్లాడా.. సైఫ్ పై దాడి చేయడానికే వెళ్లాడా.. ఎవరైనా సఫారీ ఇచ్చారా.. ఏదైనా కుట్రకోణం ఉందా.. ఎప్పుడు సైఫ్ ఇంట్లోకి చొరబడ్డాడు అనే విషయాలపై నిందితుడు నుంచి పోలీసులు వివరాలు సేకరిస్తున్నట్లు తెలుస్తుంది.బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ పై ఆయన నివాసంలో గురువారం తెల్లవారు జామున 2.30 గంటల సమయంలో దుండగుడు కత్తితో దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. తీవ్ర గాయాలతో సైఫ్ లీలావతి ఆస్పత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. అయితే, దాడికి పాల్పడిన నిందితుడు పరారయ్యాడు. సైఫ్ పై దాడి ఘటన జరిగిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. తెల్లవారుజామున 2.33 గంటల సమయంలో నిందితుడు మెట్లుదిగి వెళ్తున్నట్లు సీసీటీవీ పుటేజీలో కనిపించింది. బ్యాగ్ తగిలించుకుని, స్కార్ఫ్ భుజంపై వేసుకొని కనిపించాడు. సీసీ ఫుటేజీల్లో రికార్డయిన నిందితుడి ఫొటోలను పోలీసులు విడుదల చేశారు. దుండగుడిని పట్టుకునేందుకు 20 పోలీస్ బృందాలు రంగంలోకి దిగాయి.తెల్లవారు జామున దాడి జరిగిన తరువాత బాంద్రా రైల్వే స్టేషన్ సమీపంలో అనుమానితుడు కనిపించాడని పోలీసులకు సమాచారం అందింది. దీంతో రైల్వే స్టేషన్ పరిసరాలతో పాటు.. ఇతర ప్రాంతాల్లో రాత్రి మొత్తం పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. శుక్రవారం ఉదయం నిందితుడిని ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉదయం అతన్ని బాంద్రా పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చిన దృశ్యాలు కనిపించాయి. అయితే, పోలీసులు అతనే సైఫ్ పై దాడి చేసిన నిందితుడని ఎలాంటి ప్రకటన చేయలేదు. విచారణ పూర్తయిన తరువాత పూర్తి వివరాలను మీడియాకు ముంబై పోలీసులు వెల్లడించే అవకాశం ఉంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img
- Advertisment -spot_img

Most Popular