జంప్డ్ డిపాజిట్” స్కామ్ బారిన పడుతున్న వారు ఇటీవల కాలంలో పెరిగిపోయారు. UPI ద్వారా చెల్లింపులు చేసేవారిని ఈ స్కామర్లు టార్గెట్ చేశారు.నిజానికి ఇప్పుడు ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ యూపీఐ వాడుతున్నారు అందుకే వీరిని ఈజీగా టార్గెట్ చేస్తున్నారు. ఈ స్కాం గురించి సైబర్ క్రైమ్ నిపుణులు జాగ్రత్తలు చెబుతున్నారు.
పది రూపాయలు ఎరగా వేసి దోచేసేవాళ్ల టైప్ స్కాం
బ్యాంకుల వద్ద డబ్బులు డ్రా చేసుకుని బయటకు వచ్చిన వారికి ఓ పది రూపాయలో.. ఇరవై రూపాయలో ఎరగా వేస్తారు. వారికి కొద్ది దూరంలో డబ్బులు వేసి సార్.. మీ డబ్బులు పడిపోయాయని చెబుతారు. వెంటనే ఆ డబ్బులు తీసుకోవడానికి అతను వంగితో బ్యాంక్ నుంచి తెచ్చిన డబ్బుల సంచితో ఉడాయిస్తారు. ఇది నేరుగా చేస్తారు. ఆన్ లైన్ స్కామర్లు కూడా ఇప్పుడు ఇదే ఫార్ములాను పాటిస్తున్నారు. ముందుగా తక్కువ మొత్తంలో టార్గెట్ చేసిన వ్యక్తి బ్యాంక్ ఖాతాకు పంపుతారు. వెంటనే ఫోన్లు చేసి డబ్బులు పంపామని ఓ సారి చెక్ చేయాలని కోరుతారు. వెంటనే చెక్ చేస్తే ఆ ఖాతా వారి యాక్సెస్లోకి వెళ్లిపోతుంది. సో జాగ్రత్తగా ఉండాలి అని సైబర్ క్రైమ్ పోలీసులు. హెచ్చరిస్తున్నారు