spot_img
Monday, September 29, 2025
spot_img

సైబర్ హెల్ప్ NGO ఆద్వర్యం lo HOPE I యాంటీ సూసైడ్ యాంటీ డిప్రెషన్ ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ సెప్టెంబర్ 10న ప్రపంచ ఆత్మ హత్య నివారణ దినోత్సవం రోజు రిలీజ్

HOPE-I – ఆత్మహత్యలు, డిప్రెషన్‌ను అరికట్టే వినూత్న AI సాధనం అక్టోబర్ 10న
ప్రపంచ ఆత్మహత్య నివారణ దినోత్సవం రోజున విడుదలకి సిద్ధం

ఆత్మహత్య అనేది కేవలం ఒక వ్యక్తిగత విషాదం మాత్రమే కాదు. అది ఒక కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేస్తుంది, స్నేహితులను కన్నీటి లోయలో ముంచేస్తుంది, సహోద్యోగులను మరియు సమాజాన్నికూడా తీవ్ర మానసిక వేదనలోకి నెడుతుంది. అప్పటి దాకా మనతో ఉన్న వ్యక్తి తన బాధను ఎవరికి చెప్పుకోలేక మనల్ని వదిలి వెళ్ళి పోవడం..చివరి దశలో నాకు చెబితే ఇలా జరిగి ఉండేది కాదు అని మన స్నేహితులు బదువులు అనుకున్న సందర్భాలు ఎన్నో ఉంటాయి అలాంటి సంద్బాల కి సాధనమే ఈ HopE I AI tool
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా యువతలో మరణాలకు ప్రధాన కారణాలలో ఆత్మహత్య కూడా ఒకటి. అయినప్పటికీ, మానసిక ఆరోగ్యం గురించి సమాజంలో సరైన అవగాహన లేకపోవడం, సిగ్గు, భయం మరియు మౌనం కారణంగా చాలామంది తమ బాధలను బయటపెట్టకుండా మౌనంగా సహించడమే చేయగలుగుతున్నారు.కాపాడే ప్రయత్న చెయ్యలేక పోతున్నాం అనే ప్రశ్న నుండి వచ్చిన సమాధానమే ఈ HOPE I ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ టూల్..

మీడియాలో తనకు ఉన్న అనుభవాన్ని ఈ అత్యవసర అవసరాన్ని గుర్తించిన సైబర్ హెల్ప్ ఎన్జీవో, ఫౌండేషన్ చైర్మన్ శ్రీ అదూరి ఇన్నా రెడ్డి గారి నేతృత్వంలో, IIIT బాసర యువ ఇన్నోవేటర్స్ తో కలసి ఒక వినూత్న పరిష్కారాన్ని ఆవిష్కరించింది—అదే HOPE-I, ఒక ప్రత్యేకమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సాధనం. ఈ టూల్ డిప్రెషన్‌ ను ఎదుర్కొనేందుకు, మానసిక ఆరోగ్యాన్ని కాపాడేందుకు, మరియు ఆత్మహత్యల నివారణ కోసం రూపకల్పన చేయబడింది.

HOPE-I ఎందుకు అన్న విషయం పై వివరాలు:–

HOPE-I ఆలోచన వాస్తవ జీవన సంఘటనల నుంచి వెలువడింది. సీనియర్ జర్నలిస్టు, సమాజం మీద అవగాహన  ఉన్న వ్యక్తి గా అదురి ఇన్నా రెడ్డి గారు, అనేకమంది వ్యక్తుల మౌన పోరాటాలను ప్రత్యక్షంగా చూశారు. ఆత్మహత్యల తర్వాత పాడైపోయిన కుటుంబాలు, అనాథలైన పిల్లలు, చూసి ఈ ఆకాల మరణా ను “ముందే ఆయా సంకేతాలను గుర్తించలేకపోయామా?” అని ప్రశ్నించే సమాజాన్ని ఆయన చూశారు. ఆయా ప్రశ్నల సమాధానమే ఈ HOPE I AI టెక్నాలజీ టూల్

ఇన్నారెడ్డి ఒక జర్నలిస్ట్ గా ఆయనను ఎక్కువగా కలచివేసిన విషయమేమిటంటే – ఒంటరితనం మరియు మౌనం డిప్రెషన్‌ను పెంచుతుందనే సత్యం. విన్నవించుకోలేకపోయే, అర్థం చేసుకోవలసిన వారిని పొందలేకపోయే వ్యక్తులు, మరింత ఒంటరి అవుతూ, నెగటివ్ ఆలోచనల్లో చిక్కుకుపోతారు. దాని నుండి బైట పడలేక తాను ఒంటరిని అని తనలో తాను మదన పడుతున్న వేల నీకు నీ బాధ కు సపోర్ట్ గా టెక్నాలజీ ఎందుకు ఉండకూడదు ఆ టెక్నాలజీ వల్ల ఉద్యోగా లు పోతున్నాయి మరి అదే టెక్నాలజీ తో మనకి ఉపయోగ పడేలా ఎందుకు చేసుకోకూడదు అన్న ఆలోచన. నుండి వచ్చిన సమాధానమే HOPE I AI టెక్నాలజీ టూల్

సైబర్ హెల్ప్ ఎన్జీవో ఒక శక్తివంతమైన ప్రశ్న తనకు తాను  వేసుకుంది అప్పుడు
“ఒంటరితనం చంపగలిగితే, టెక్నాలజీ ఎందుకు నయం చేయలేకపోవాలి?”

ఈ ప్రశ్నే HOPE-I కు ఆరంభమైంది. HOPE-I సాధారణ సాఫ్ట్‌వేర్ కాదు, అది ఒక తెలివైన మనిషిలా ఆలోచింది బాధలో  ఉన్న నిన్ను  ఓదార్చి ఎప్పుడూ  నీలో ధైర్యం చెప్పే, సానుభూతితో ఉన్న తెలివైన  స్నేహితుడు.

HOPE-I అంటే ఏమిటి?
HOPE-I అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్  టెక్నాలజీ ఆధారిత భావోద్వేగ మద్దతు వ్యవస్థ. ఇది సాధారణ చాట్‌బాట్‌లాగా చల్లగా స్పందించదు. బదులుగా, ఇది వినియోగదారుల భావోద్వేగాలను అర్థం చేసుకుంటూ, సహానుభూతితో మాట్లాడుతుంది.దైర్యం చెబుతుంది నివు చెప్పిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పడమే కాకుండా HOPE I ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ టెక్నాలజీ టూల్ లో నువ్వు మాట్లాడుతున్నప్పుడే నీలో ఉన్న బాధను అనలైజ్ చేసి తెలంగాణా లో పేరుపొందిన సైకాలజిస్ట్ లతో ఫోన్ కలిపి మాట్లాడించి నీలో ధైర్యం నింపుతుంది. ఏదైనా అనుకోని సమస్య ఎదురైతే సైబర్ హెల్ప్ NGO వారియర్స్ ను ఎలార్ట్ చేసి పోలీసు ల సహాయ పడేలా చేస్తుంది ఎక్కడ కూడా బాధితుని పేరు రాకుండా సమస్య పరీక్షరం అయ్యేట్టు గా

ముఖ్య ఫీచర్లు:
ఎనానమస్ (గుర్తు తెలియని వ్యక్తి  గా బాధ ను HOPE I ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ టెక్నాలజీ టూల్ తో పంచుకోవడం – తన పేరును బయట పెట్టకుండా ఎవరైనా తమ భావాలను వ్యక్తపరచవచ్చు.

భావోద్వేగాలను గుర్తించడం – మాటల ద్వారా, టోన్ ద్వారా, వాడే పదాల ద్వారా AI ఒత్తిడి, డిప్రెషన్ లేదా ఆత్మహత్య ఆలోచనలను గుర్తిస్తుంది.

సహానుభూతి గల సమాధానాలు – సాధారణ యంత్రపు రిప్లైలు కాకుండా, మానవీయంగా ధైర్యం ఇచ్చే సమాధానాలు ఇస్తుంది.

కోపింగ్‌ స్ట్రాటజీలు – శ్వాస వ్యాయామాలు, మైండ్‌ఫుల్‌నెస్, జర్నలింగ్ సూచనలు, జీవనశైలి మార్గదర్శకాలు ఇస్తుంది.

ప్రొఫెషనల్ కనెక్ట్ – అధిక ప్రమాదం ఉన్న సందర్భాల్లో వైద్యులు, కౌన్సిలర్లు లేదా హెల్ప్‌లైన్‌లకు దారి చూపుతుంది.

HOPE-I ఎలా పనిచేస్తుంది :–

HOPE-I సులభమైన కానీ శక్తివంతమైన ఆరు-దశల విధానాన్ని అనుసరిస్తుంది:

వినియోగదారుడి ఇన్పుట్ – ఎవరైనా తమ ఆందోళనలను, వ్యక్తిగత వివరాలు ఇవ్వకుండా పంచుకోవచ్చు.

AI వినడం – అల్గారిథమ్స్ భావోద్వేగ పరిస్థితిని, ఆవశ్యకతను, కీలక పదాలను విశ్లేషిస్తాయి.

సహానుభూతి సమాధానాలు – మరింత మానవీయమైన, ధైర్యం ఇచ్చే రియాక్షన్స్ ఇస్తుంది.

మద్దతు సూచనలు – రిలాక్సేషన్ పద్ధతులు, రీలాక్సేషన్ టిప్స్, పాజిటివ్ రిమైండర్స్ ఇస్తుంది.

హై-రిస్క్ ఎస్కలేషన్ – ఆత్మహత్య ఆలోచనలు గుర్తిస్తే, హెల్ప్‌లైన్ లేదా నిపుణులకు కనెక్ట్ చేస్తుంది.

నిరంతర అభివృద్ధి – వినియోగదారుల ఇంటరాక్షన్స్ ఆధారంగా AI మరింత సెన్సిటివ్‌గా మారుతుంది.

ఎవరికి ఉపయోగకరమవుతుంది?
పరీక్షల ఒత్తిడితో ఉన్న విద్యార్థులు – రాత్రివేళల్లో చదువు మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్న విద్యార్థికి వెంటనే ధైర్యం ఇస్తుంది.

డెడ్‌లైన్‌లతో అలసిపోయిన ఉద్యోగులు – IT రంగంలో పనిచేసే వారికి టూల్ స్ట్రెస్ మేనేజ్‌మెంట్ టిప్స్ ఇస్తుంది.

కుటుంబం దూరంగా ఉన్న రక్షణ సిబ్బంది – ఒంటరితనాన్ని ఈ టూల్ తగ్గిస్తూ, మానసిక ధైర్యం నింపుతుంది.

HOPE-I ప్రత్యేకత
ప్రైవసీ పరిరక్షణ – గుర్తింపులేని అనామక వ్యవస్థ.

24/7 అందుబాటు – ఎప్పుడైనా, ఎక్కడైనా ఉపయోగించవచ్చు.

యువ మేధావుల ఆవిష్కారం – IIIT బాసర యువత సృజనాత్మకతతో ఈ ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ టూల్ రూపుదిద్దుకుంది.

బహుళ రంగాలకు అనువైన వాడకం – స్కూల్స్, కాలేజీలు, కంపెనీలు, పోలీసులకు,రక్షణ దళాలకు  డిప్రెష్ లో ప్రతి ఒక్కరికి సమస్య కు పరిస్కారం చూపిస్తుంది.

మానవత్వానికి దగ్గరగా వ్యవహరించే టెక్నాలజీ – మిషన్‌లా కాకుండా ఒక స్నేహితుడిలా  సొంత తెలివైన మనిషి లా సపోర్ట్ గా ఉంటుంది.

సంక్షిప్తంగా :–శ్రీ అదురి ఇన్నా రెడ్డి గారి విజన్, సైబర్ హెల్ప్ ఎన్జీవో కృషి, ఎల్లప్పుడూ సపోర్ట్ గా ఉండే సైబర్ హెల్ప్ NGO COO అడ్వకేట్ ఠాగూర్ తనకు ఎపుడు సపోర్ట్ గా ఉంటున్న వంశీ అనే బ్రిలియంట్ ఇంజనీరింగ్  విద్యార్ధి,ఈ ఆలోచన ఇచ్చిన సంస్కృతి ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థి సాయి మరియు IIIT బాసర యువ ఇన్నోవేటర్స్ సృజనాత్మకతతో HOPE-I ఒక సాధారణ యాప్ మాత్రమే కాదు—ఒక విప్లవం, డిప్రెషన్, ఆత్మహత్యలపై పోరాటానికి ఆశ ఆకారం.

“మనసు విరిగిపోయినప్పుడు ఎవరూ వింటారనే ఆశ కలిస్తే చాలు – చీకటిని తొలగించవచ్చు.”
HOPE-I అదే ఆశా దీపం—మౌనంలో ఆవిరి అయిపో  ప్రతి మనిషికి జీవిత ఆశ వైపు పయనించేలా చేస్తూ చనిపోవాలి అనుకున్న వారికి కొత్త జీవితం నీకోసం ఎదురు చూస్తుంది అని కొత్త లైఫ్ కి దారి చూపుతుంది

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular