spot_img
Monday, March 23, 2026
spot_img

సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉందంటూ భార్యను చంపిన భర్త

టైం పాస్ కోసం అంటూ మొదలు పెట్టీ కొందరు షోషల్ మీడియాలో యాక్టిివ్ గా ఉంటూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.ఇలా కొంత మంది గృహిణులు కూడా సోషల్‌ మీడియాకు బాగా అడిక్ట్‌ అయిపోయి ఫేమస్‌ అవ్వడం కోసం.. అందరూ గుర్తుపట్టాలనే ఉద్దేశంతో కొందరు ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌..ఇలా సోషల్‌ మీడియాలో తరచూ ఫొటోలు, వీడియోలను చేస్తుంటారు.

ఓ వివాహిత కూడా ఇలానే చేసింది. అది ఆమె భర్తకు నచ్చలేదు. ఈ విషయంలో తరచూ భార్యతో గొడవపడేవాడు. అయినా.. ఆమె సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండటం మానలేదు. చివరకు ఆ భర్త దారుణానికి ఒడిగట్టాడు.

ఈ సంఘటన పశ్చిమ బెంగాల్‌లోని సౌత్ 24 పరగణాల జిల్లాలోని హరియాణాపూర్‌లో చోటుచేసుకుంది. ఒక వివాహిత సోషల్‌ మీడియాలో తరచూ ఉండటాన్ని ఆమె భర్త పరిమల్‌ తీసుకోలేకపోయాడు. ఎప్పుడూ ఫోన్‌నే వాడుతున్నావని.. సోషల్‌మీడియాలో అంతగా ఉండొద్దని సూచించాడు. కానీ ఆమె వినలేదు. దాంతో.. సోషల్‌ మీడియా గురించే ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఇటీవల మరోసారి గొడవ జరిగింది. మాటామాటా పెరిగి ఘర్షణ వరకు వెళ్లింది. దాంతో సహనం కోల్పోయిన భర్త పరిమల్‌ దారుణంగా వ్యవహరించాడు. ఇంట్లో కూరగాయలు కోసే కత్తి తీసుకుని భార్యపై దాడికి దిగాడు. ఆమె గొంతు కోసి చంపేశాడు. ఆ తర్వాత పరిమల్‌ ఇంట్లో నుంచి పారిపోయాడు.

అయితే.. ఈ ఇద్దరు దంపతులకు ఒక మైనర్‌ కుమారుడు ఉన్నాడు. ఈ సంఘటనపై మాట్లాడిన బాలుడు.. తాను ఇంటికి వచ్చే సరికి అమ్మ రక్తపు మడుగులో పడి ఉందని చెప్పాడు. దాంతో భయపడిపోయి పక్కన ఇంట్లో ఉన్నవారికి చెప్పానన్నాడు. అయితే.. సోషల్‌ మీడియాలో గొడవపడుతుండే వారని.. గొంతు కోస్తా అంటూ తరచూ తన నాన్న అంటుంటే వాడని చెప్పాడు.

ఈ సంఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు మృతురాలు అపర్ణగా వెల్లడించారు. సోషల్‌ మీడియా గొడవే ఈ హత్యకు దారి తీసిందని వెల్లడించారు. అపర్ణకు సోషల్ మీడియాలో కొందరు ఆన్‌లైన్ ఫ్రెండ్స్ ఉన్నారని వెల్లడించారు. ఈ కారణంతోనే అపర్ణను పరిమల్ చంపాడని పోలీసులు అన్నారు. కాగా.. నిందితుడు పరిమల్ ప్రస్తుతం పరారీలో ఉన్నానీ.. అతని కోసం గాలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img
- Advertisment -spot_img

Most Popular