వికారాబాద్ జిల్లా మద్దూరుకు చెందిన భానుప్రకాష్(22) షాపూర్‌నగర్‌లో తల్లితో కలిసి నివాసముంటున్నాడు. రామాంతపూర్‌లోని అరోరా కళాశాలలో ఎంసీఏ చదువుతున్నాడు. ఆన్‌లైన్ యాప్‌లో గతంలో పెట్టుబడి పెట్టాడు. లాభాలు రావడంతో స్నేహితులవద్ద అప్పులు తీసుకొని రూ.65వేలు పెట్టాడు.
డబ్బులు రాకపోవడంతో మనస్తాపానికి గురయ్యాడు. గురువారం ఇంటినుంచి వెళ్లి తిరిగి రాలేదు. అదేరోజు రాత్రి అతడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్సై ఆంజనేయులు భానుప్రకాష్ చరవాణి సిగ్నల్స్ ఫాక్స్‌సాగర్ సమీపంలో ఉన్నట్లు గుర్తించారు. శుక్రవారం పోలీసులు అతడి మృతదేహాన్ని చెరువు నుంచి బయటకు తీశారు.