spot_img
Monday, March 23, 2026
spot_img

హమాస్ కమాండర్ అహ్మద్ సియామ్ హతం

గాజా ఆస్పత్రిలో వెయ్యి మందిని బందీ చేసిన హమాస్ ఉగ్రవాది, కమాండర్ అహ్మద్ సియామ్ హతమయ్యాడు. ఫైటర్ జెట్ దాడిలో అతను ప్రాణాలు కోల్పోయినట్లు ఐడీఎఫ్ వెల్లడించింది.

హమాస్ సీనియర్ కమాండర్(Hamas Commander) అహ్మద్ సియామ్‌ను హతమార్చినట్లు ఇజ్రాయిల్ మిలిటరీ తెలిపింది. అయితే అతను సుమారు వెయ్యి మంది వ్యక్తుల్ని గాజా ఆస్పత్రిలో బంధించినట్లు తెలుస్తోంది. గాజాలో ఉన్న ప్రజల తరలింపు ప్రక్రియను అహ్మద్ సియామ్ అడ్డుకున్నట్లు ఇజ్రాయిల్ డిఫెన్స్ దళాలు పేర్కొన్నాయి. రంతిసి ఆస్పత్రిలో బందీలను సియామ్ దాచిపెట్టనట్లు ఐడీఎఫ్ తెలిపింది.

హమాస్‌కు చెందిన నాసిర్ రద్వాన్ కంపెనీ కమాండరే అహ్మద్ సియామ్‌. గాజా సిటీలో ఉన్న అల్ బురాక్ స్కూల్‌లో దాచుకున్న సమయంలో జరిగిన ఫైటర్ జెట్ దాడిలో సియామ్ హతమయ్యాడు. అతనితో పాటు హమాస్ ఆపరేటివ్స్ కూడా ఆ దాడిలో ప్రాణాలు కోల్పోయారు.

షిన్ బెట్‌, మిలిటరీ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ ఇచ్చిన సమాచారం ఆధారంగా ఐడీఎఫ్ ఆ దాడి చేసినట్లు తెలుస్తోంది. ద గివాటీ బ్రిగేడ్ ట్రూప్స్ .. ఫైటర్ జెట్‌ను ఆపరేట్ చేశాయి. హమాస్ ఉగ్రవాదులు నక్కి ఉన్న ప్రాంతాన్ని పేల్చేశాయి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img
- Advertisment -spot_img

Most Popular