spot_img
Monday, March 23, 2026
spot_img

హర్షసాయి కేసులో బిగ్ ట్విస్ట్.. పరారీలో మరో యూట్యూబర్

హర్షసాయి కేసులో సంచలన విషయాలు బయటికొచ్చాయి. ఈ వ్యవహారంలో యూట్యూబర్ ఇమ్రాన్ పేరు బయటికొచ్చింది. ఇప్పటికే హర్షసాయి వ్యవహారాలకు యూట్యూబర్ ఇమ్రాన్ మద్దతు తెలిపిన విషయం తెలిసిందే.అయితే హర్ష సాయి పెద్ద మోసగాడని, ఆటను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి ఎంతమంది అమాయకుల చావుకు కారణం అయ్యాడని యువసామ్రాట్ అలియాస్ రవి అనే వ్యక్తి సోషల్ మీడియాలో హర్షసాయిపై తీవ్ర ఆరోపణలు చేశాడు. దీనిపై రియాక్ట్ అయిన హర్షసాయి.. యువసామ్రాట్ తనపై తప్పుడు ఆరోపణలు చేసున్నాడని అతనిపై గతంలో హర్ష సాయి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టాడు. ఆ సమయంలో హర్షసాయి పోలీసులకు యూట్యూబర్ ఇమ్రాన్ అడ్రస్ ను తన అడ్రస్ గా ఇచ్చాడు. దీంతో ఇప్పడు ఇదికాస్త తీవ్ర చర్చకు దారి తీసింది.ఇమ్రాన్ అడ్రస్తో హర్షసాయి కేసు పెట్టడం ఏంటి? హర్షసాయి, యూట్యూబర్ ఇమ్రాన్ మధ్య లింకేంటి? హర్షసాయి అరాచకాలకు ఇమ్రాన్ సపోర్ట్ ఉందా? అనే రీతిలో పోలీసులు ఎంక్వయిరీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే హర్షసాయి తప్పుడు అడ్రస్ ఇవ్వడంపై పోలీసులు సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం హర్ష సాయి పరారీలో ఉన్న విషయం తెలిసిందే. అతన్ని పోలీసులు వెతుకుతున్నారు. అటు ఇమ్రాన్ సైతం ఇప్పుడు పరారిలో ఉన్నట్లు సమాచారం.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img
- Advertisment -spot_img

Most Popular