కొంతమంది హీరోలు చూడడానికే హీరోల్లాగా ఉంటారు.. కానీ వారి నిజ స్వరూపం మరోలా ఉంటుంది. ఇది దగ్గరి నుండి ఫేస్ చేసిన వారికి మాత్రమే అర్థమవుతుంది.తాజాగా కోలీవుడ్ హీరో కి సంబంధించి బాగోతం బయటపెట్టింది ఒక అమ్మాయి.అది కూడా ఆ హీరో పేరుని నిర్భయంగా ట్యాగ్ చేస్తూ.. ఇక విషయంలోకి వెళ్తే..తాజాగా రమ్య మోహన్ అనే ఒక అమ్మాయి తన సోషల్ మీడియా ఖాతాలో షాకింగ్ పోస్ట్ పెట్టింది. ఆ పోస్టులో ఏముందంటే..కోలీవుడ్లో డ్రగ్స్, క్యాస్టింగ్ కౌచ్ అనేది నిజంగానే ఉంది. ఇది జోక్ కాదు..నాకు తెలిసిన ఓ అమ్మాయిని ఒక హీరో లొంగ తీసుకొని లోబర్చుకున్నాడు. ఇండస్ట్రీ నిబంధనలో ముసుగులో ఆ హీరో ప్రవర్తిస్తున్నాడు. అంతేకాదు ఆ హీరో కేరావాన్ ఫేవర్స్ కోసం రెండు లక్షలు,డ్రైవ్స్ కోసం 50,000 ఆఫర్ చేశాడు. అయితే ఈ విషయం నేను బయట పెట్టినా కూడా ఆ వ్యక్తిని మీడియా దేవుడిలా చూపిస్తుంది. కానీ ఆ బాధితురాలిని మాత్రం పట్టించుకోవడం లేదు. ఇండస్ట్రీలో డ్రగ్స్, సెక్స్ అనేది నిజంగానే ఉంది జోక్ కాదు.ఆ వ్యక్తి బయటికి దేవుడిలాగే కనిపిస్తున్నాడు. కానీ లోపల ఆయన వ్యక్తిత్వం వేరే ఉంది మారువేషం వేసుకొని ఉన్నాడు. (Hero)
మొదట నేను ఆ అమ్మాయికి సంబంధించిన ఫోన్ చాట్స్ చూసినప్పుడు షాక్ అయిపోయాను. ఆమెకు సంబంధించిన ఈ విషయం తెలిసి కుటుంబం సైతం షాక్ అయిపోయింది.ఇది కథ కాదు ఆ అమ్మాయి జీవితం.. అయితే ఈ విషయం బయటపడ్డాక చాలామంది ఆ అమ్మాయిని నిందిస్తారు. కానీ ఆ మూర్ఖుడిని గుర్తించరు అంటూ సంచలన పోస్ట్ పెట్టింది రమ్య మోహన్ అనే అమ్మాయి.అంతేకాదు ప్రస్తుతం ఆ హీరో వల్ల క్యాస్టింగ్ కౌచ్ కి గురైన ఆ అమ్మాయి రిహబిలిటేషన్ సెంటర్లో ఉందని కూడా బయటపెట్టింది.అయితే ఆమె పెట్టిన ఈ పోస్టులో ఆ హీరో పేరు కూడా ట్యాగ్ చేసి ఉండడం గమనార్హం.దీంతో ఈ పోస్ట్ చూసిన చాలా మంది నెటిజన్లు షాక్ అయిపోయారు.పెద్ద ఎత్తున ఆ హీరో గురించి మాట్లాడుకున్నారు.కానీ ఈ పోస్ట్ చేసిన కొద్ది క్షణాలకే రమ్య మోహన్ దాన్ని డిలీట్ చేసింది. దీంతో చాలామంది నెటిజన్లు ఎందుకు రమ్య మోహన్ పోస్ట్ డిలీట్ చేసింది ఆమెకు ఆ హీరో నుండి బెదిరింపులు వచ్చాయా అని కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ ఆ హీరో పేరుని ప్రస్తావిస్తూ రమ్య మోహన్ పెట్టిన పోస్ట్ కి చాలా మంది మెచ్చుకుంటున్నారు. మరి ఇందులో ఎంత నిజం ఉంది.. ఆ హీరో నిజ స్వరూపం ఇదేనా అనేది తెలియాల్సి ఉంది.(Hero)
