spot_img
Monday, March 30, 2026
spot_img

సినీ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ తలనరికి తెస్తే రూ.కోటి ఇస్తామన్న వివాదాస్పద వ్యాఖ్యల కేసులో అమరావతి పరిరక్షణ సమితి అధ్యక్షుడు కొలికపూడి శ్రీనివాసరావు, టీవీ 5 న్యూస్‌ యాంకర్‌ సాంబశివరావులను సీఐడీ అధికారులు సోమవారం విచారించారు.

గుంటూరులోని సీఐడీ కార్యాలయంలో సోమవారం ఉదయం 11గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు దాదాపు 5.30 గంటలపాటు వారిద్దరిని కలిపి, విడివిడిగానూ విచారించారు.

టీవీ 5 చానల్‌ నిర్వహించిన డిబేట్‌ ద్వారా తన హత్యకు ప్రేరేపించేందుకు ఉద్దేశపూర్వకంగానే కొలికపూడి శ్రీనివాసరావు ఆ వ్యాఖ్యలు చేశారని రామ్‌గోపాల్‌ వర్మ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అందుకు బాధ్యులుగా ఆయన పేర్కొన్న కొలికపూడి శ్రీనివాసరావుతో పాటు, టీవీ 5 చానల్‌ ఎండీ, చీఫ్‌ ఎడిటర్‌ బి.ఆర్‌.నాయుడు, న్యూస్‌ యాంకర్‌ సాంబశివరావు, ఫిరోజ్, టీవీ 5 మేనేజింగ్‌ ఎడిటర్లపై పలు సెక్షన్ల కింద సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు.

ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఈనెల 3న కొలికపూడి శ్రీనివాసరావును సీఐడీ అధికారులు మొదటి దఫా విచారించారు. కాగా ఆరోజు న్యూస్‌ యాంకర్‌ సాంబశివరావు విచారణకు హాజరుకాలేదు. దాంతో వారిద్దరిని సోమవారం సీఐడీ అధికారులు విచారించారు. ఆర్జీవీని హత్య చేసేలా ఎందుకు వ్యాఖ్యానించారు? ఉద్దేశపూర్వకంగానే మాట్లాడారా? ఆ వ్యాఖ్యలతో ప్రేరేపితమై ఎవరైనా అవాంఛనీయ ఘటనకు పాల్పడితే పరిణామాలు ఎలా ఉంటాయో అవగాహన ఉందా.. సమాజంలో విద్వేషాలు రేకెత్తించకూడదన్న అవగాహన లేదా..? అంటూ వారిద్దరిపై సీఐడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img
- Advertisment -spot_img

Most Popular