ఉత్తరాఖండ్‌లో హెచ్‌ఐవీ కేసులు పెరిగిపోయాయి. ముఖ్యంగా నైనిటాల్ జిల్లాలో ఎయిడ్స్ కేసులు ఎక్కువయ్యాయి. కారణమేంటని వాకబ్ చేస్తే రామ్ నగర్‌కు చెందిన పదిహేడేళ్ల అమ్మాయి ఇందుకు మూలకారణమని తేలింది.డ్రగ్‌కు అడిక్ట్ అయిపోయిన అమ్మాయి.. డబ్బుల కోసం వ్యభిచారమే మార్గంగా ఎంచుకుంది. దీంతో అమ్మాయి ఇదే పనిలో ఉండగా.. ఈమెకు హెచ్‌ఐవీ సోకింది.
కానీ ఈ విషయం ఆమెకు కూడా తెలియకపోవడంతో.. తనతో శృంగారంలో పాల్గొన్న పందొమ్మిది మందికి కూడా హెచ్‌ఐవీ పాస్ అయింది. వీరిలో కొంత మందికి పెళ్లి కూడా కాగా వారి కూడా ఎయిడ్స్ వచ్చింది. కాగా ఏడాదిలో దాదాపు 45 కొత్త హెచ్‌ఐవీ కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ అధికారులు ప్రకటించారు. కంట్రోల్ చేసేందుకు అవగాహనా కార్యక్రమాలు, హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేశారు.
19మందికి హెచ్‌ఐవీ అంటించిన యువతి
RELATED ARTICLES