ప్రముఖ జోతిష్యులు వేణు స్వామి. ఆయన అప్పట్లో నాగ చైతన్య, సమంత వివాహం తర్వాత వీళ్లు ఎక్కువ కాలం కలిసి ఉండలేరు అంటూ బాంబు పేల్చారు.ఆయన చెప్పినట్లుగానే విడిపోవడంతో ఆయన ఒక్కసారిగా ఫేమస్ అయ్యారు. ఇక ఆయన ఏ కామెంట్స్ చేసినా ఫేమస్ అయిపోతున్నారు. తాజాగా ఇండస్ట్రీలో టాలీవుడ్ హీరో సుసైడ్ చేసుకుంటారు.. ఇంకో హీరో చనిపోతాడు అంటూ బాంబు పేల్చాడు. ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందామా
వేణు స్వామి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఆయన సెలబ్రెటీల జాతకాలు చెప్పుకుంటూ ఫేమస్ అయిపోయాడు. నాగచైతన్య, సమంత విడాకులు అప్పటి నుంచి వేణు స్వామి వెలుగులోకి వచ్చారు. ఇక ఆయనతో ఎంతో మంది స్టార్ హీరోలు, హీరోయిన్లు పూజలు కూడా చేయించుకుంటారు. అయితే ఆయన ఇటీవల చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. త్వరలో టాలీవుడ్లో హీరోలు చనిపోతారంటూ బాంబు పేల్చాడు.
ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… రాజమౌళి పది పైసలు పక్కన తీసి పడేస్తే… అది రూపాయిగా రూపాంతరం చెందుతుంది.. అది రాజమౌళి జాతకం. తెలుగులో డిజాస్టర్ అయిన సినిమాలు రాజమౌళి తీసి ఉంటే.. హిట్ అయ్యి ఉండేది. ఆయన పేరు ఉంటే చాలు సినిమా హిట్ అవుతుంది. అంటే ఆయన జాతకం అలాంటిది అంటూ చెప్పుకువచ్చారు. ప్రభాస్ జాతకం బాలేదు అని ఇప్పటికే చెప్పాను.. ఆయన బహుబలి సినిమా తర్వాత ఏ సినిమా అయినా ఆ రేంజులో హిట్ అయిందా అంటూ స్పష్టం చేశాడు.ఇక టాలీవుడ్లో తారక రత్న లాంటి ఓ జాతకం ఉన్న స్టార్ హీరో మరణిస్తాడు అంటూ బాంబు పేల్చాడు. తులా రాశి, వృశ్చిక రాశికి సంబంధించిన హీరో చనిపోతాడు.. మిధున రాశికి సంబంధించిన మరో హీరో చనిపోతాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. డేట్ ఆఫ్ బర్త్ తీసి.. ఏ హీరోనో చెక్ చేసుకోండి.. నేను పేరు చెప్పలేను. టాలీవుడ్ లో 2026 కల్లా ఇద్దరు స్టార్ హీరోలు చనిపోతారు.. అందులో ఒకరు సూసైడ్ చేసుకుంటారు.. మరొకరు ఆరోగ్య పరమైన సమస్యలతో చనిపోతాడు అంటూ వేణు స్వామి కుండ బద్దలు కొట్టారు.
2026 కల్లా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ హెల్త్ పరమైన సమస్యలతో డిస్ట్రబ్ అవుతుంది. చనిపోయే ఛాన్స్ కూడా ఉందని చెప్పుకువచ్చారు. వాళ్లకు వచ్చిన స్టార్ డమ్ కాపాడుకోలేక.. ఆయన మానసిక ఒత్తిడికి గురై.. ఆత్మహత్య చేసుకుంటాడని సంచలన వ్యాఖ్యలు చెప్పుకువచ్చారు. ప్రపంచంలో మూడే ముఖ్యం.. ఒకటి డబ్బు, రెండు రిలేషన్స్.. మూడు స్టార్ డమ్.. దీనిలో ఏది కోల్పోయినా.. సెలబ్రెటీలు తట్టుకోలేరు.. అందుకే చనిపోయే స్టేజ్ కి వస్తారు… అలా ఓ స్టార్ హీరో చనిపోతాడు అంటూ చెప్పుకువచ్చాడు వేణు స్వామి.
వేణు స్వామి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అసలు ఆ హీరోలు ఎవరు అని నెటిజన్స్ ఆరా తీస్తున్నారు. ఇప్పటికే వేణు స్వామి చేసిన వ్యాఖ్యలు చాలా వరకు నిజం అయ్యాయి. ఇప్పుడు బాంబు పేల్చడంతో.. ఎవరు ఆ హీరోలు.. ఆ హీరోయిన్ ఎవరు అని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ప్రభాస్ విషయంలో వేణు స్వామి చేసిన కామెంట్స్ దాదాపు నిజం అవుతున్నాయి… ఇక ప్రభాస్ ఫ్యాన్స్ కూడా టెన్షన్ లో ఉన్నారు. ఆయన మాటాలు నిజమో కాదో తెలియాలంటే.. కొన్నాళ్లు ఆగాల్సిందే. చూడాలి మరి ఏం జరగనుందో.వేచి చూడాలి