సైబర్ నేరాలు పెరిగిపోవడం తో పోలీసులు సైబర్ నేరగాళ్లు గుట్టు రట్టు చెయ్యడమే కాక..వారిని అరెస్ట్ చేసి రికవరీ పై దృష్టి పెట్టారు.గత ఆరు నెలల్లో తమ పరిధిలోని 7 సైబర్ క్రైం పోలీస్ స్టేషన్లలో నమోదైన 76 కేసుల్లో 165 మంది నిందితులను అరెస్టు చేసినట్లు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎ్‌సబీ) వెల్లడించింది. తదుపరి విచారణ కోసం దేశవ్యాప్తంగా సంబంధిత పోలీసు ేస్టషన్లకు ఈ అరెస్టుల సమాచారం చేరవేసినట్లు టీజీసీఎ్‌సబీ డైరెక్టర్ శిఖాగోయెల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు. టీజీసీఎ్‌సబీ సమాచారం ప్రకారం నిందితుల్లో 49 శాతం మంది 21-30 మధ్య వయస్కులు, 31-40 మధ్య వయస్కులు 28 శాతం మంది ఉన్నారు. వీరిలో గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు 45 శాతం మంది ఉన్నారు. గత 6 నెలల్లో దేశవ్యాప్తంగా 3,357, తెలంగాణలో 795 సైబర్ నేరాల కేసులు నమోదయ్యాయని తెలిపారు.
6 నెలల్లో 165 మంది సైబర్ నేరగాళ్లు అరెస్టు – తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో
RELATED ARTICLES