వాట్సాప్ వంటి సోషల్ మీడియా సైట్స్ని ఉపయోగించుకుని నేరాలకు పాల్పడుతున్నారు స్కామ్స్టర్స్. కొన్ని మెసేజ్లు చదివి.. ముందు, వెనుక ఆలోచించకుండా.. ప్రజలు స్కామ్కు బలైపోతున్నారు. అందుకే.. స్కామ్స్పై అవగాహన పొందడం చాలా అవసరం. చాలా ముఖ్యం. ఈ నేపథ్యంలో.. వాట్సాప్ మెసేజ్ల ద్వారా ఎలా స్కామ్స్ జరుగుతున్నాయి? వాటికి మనం ఎలా దూరంగా ఉండాలి
వాట్సాప్ స్కామ్కు ఇలా దూరంగా ఉండండి..
బహుమతులు చూసి బలవ్వకండి:- ఫ్రీ ప్రైజ్లు, రివార్డులు అంటూ మీకు ఎమైనా మెసేజ్లు వస్తే.. వాటిని అస్సలు పట్టించుకోకండి. ప్రజలను వలలో వేసుకుని భారీగా మోసం చేసేందుకు స్కామ్స్టర్స్ ప్లే చేసే ట్రిక్ ఇది. వీటి జోలికి వెళ్లకపోవడమే బెటర్.
లింక్స్కి దూరంగా ఉండండి:- మీకు తెలియని అకౌంట్ నుంచి ఏదైనా మెసేజ్ వస్తే.. అస్సలు స్పందించకూడదు. మరీ ముఖ్యంగా.. ఆ మెసేజ్లోని లింక్స్పై అస్సలు క్లిక్ చేయకూడదు. క్లిక్ చేసిన వెంటనే.. మీ వ్యక్తిగత, బ్యాంక్ సంబంధిత సమాచారాలు నేరగాళ్ల చేతికి వెళ్లే ప్రమాదం ఉంది. అవును! ఇప్పుడు టెక్నాలజీ బాగా పెరిగిపోయింది.
యాప్స్ డౌన్లోడ్ చేసుకోకండి:- యాప్స్ డౌన్లోడ్ చేసుకోవాలి అని గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్ లింక్స్ వస్తే.. వాటిని పక్కనపెట్టేయండి. అస్సలు డౌన్లోడ్ చేసుకోకడు. మీ ఫోన్.. నేరగాళ్ల చేతిలోకి వెళ్లొచ్చు. మీ వివరాలు వారికి తెలిసిపోతాయి.
ఫేక్ జాబ్ ఆఫర్స్:- ఈ విషయంలోనే చాలా మంది మోసపోతుంటారు. ఉద్యోగం వస్తుంది కదా అని సంబంధిత మెసేజ్లకు స్పందిస్తారు. పార్ట్-టైమ్ అని, ఫుల్-టైమ్ అని వాట్సాప్లో చాలా మెసేజ్లు వస్తున్నాయి. కానీ అవి నిజం కావు! ముందు కొంత డబ్బులు కట్టాలని, ట్రైనింగ్ ఇస్తామని చెబుతారు. డబ్బులు కట్టిన తర్వాత ఇక అటువైపు నుంచి రిప్లై ఉండదు.
How to stay safe from Cyber crimes : బ్యాంక్ అలర్ట్:- మీ అకౌంట్ నుంచి రూ. xxxx డెబిట్ అయ్యింది అని మెసేజ్ వస్తుంది. అది మీరు చూసి టెన్షన్ పడతారు. ఆ సమయంలో.. ఆలోచించకుండా, మెసేజ్ కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తారు. అంతే! సైబర్ నేరగాళ్లు వాళ్ల పని మొదలుపెడతారు. అవి ఫేక్ మెసేజ్లని మీరు గ్రహించాలి. నిజమైన బ్యాంక్ నుంచి వచ్చే మెసేజ్, ఆ మెసేజ్లో కాస్త వ్యత్యాసం ఉంటుంది.