భీమవరం పట్టణం కాల్లా లో పుట్టింటికి వెళ్తానన్న భార్యపై దాడి
కాళ్ల (భీమవరం పట్టణం), పుట్టింటికి వెళ్తానని అడిగిన భార్యపై కోపోద్రిక్తుడైన భర్త దాడికి పాల్పడగా..గాయాలపాలైన ఆమె చికిత్స పొందుతూ మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం.. కాళ్ల గ్రామానికి చెందిన ఉండ్రాళ్ల దుర్గ (28), యేసు దంపతులకు ముగ్గురు పిల్లలున్నారు. అనారోగ్యంగా ఉండటంతో పుట్టింటికి వెళ్లి కొద్దిరోజులు ఉండి వస్తానని భర్త యేసును దుర్గ ఈ నెల 7న అడిగారు.
ఈ అంశంపై వారి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో భర్త ఆమె జుట్టు పట్టుకుని మంచానికి వేసి కొట్టాడు. తలకు బలమైన గాయమైన దుర్గ అపస్మారకస్థితికి చేరగా ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ ఆమె శుక్రవారం మృతి చెందారు. ఈ ఘటనపై దుర్గ చెల్లెలు ఎ.హేమలత ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై వీఎస్ వీరభద్రరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.