spot_img
Monday, July 21, 2025
spot_img

తెలుగు టివి చానల్స్ డిజిటల్ వ్యూసే న్యూస్..కొత్త చానల్స్ లో లేని కొత్తదనం..Rtv లో ఆ మార్పు ఉంటుందా?

ఎలక్షన్ హడావిడి మొదలు కాక ముందే కొన్ని కొత్త చానల్స్ వచ్చాయి ..డిజిటల్ యుగంలో లో టివి లు చూడటం తగ్గినా టివి చూసే ప్రేక్షకుడు ..ఎందుకు చూడాలి న్యూస్ ఛానల్..పార్టీ కో ఛానల్..ఎవరి ఎజెండా వారిది ప్రజల పక్షాన నిలబడి కలబడే ఛానల్ వస్తుందా అని ఆశగా ఎదురు చూశారు కానీ అత్యాసగానే మిగిలిపోయింది..

ఒకప్పుడు ఏదైనా కొత్త న్యూస్ ఛానల్ వస్తోంది అంటే జనాల్లో విపరీతమైన ఆసక్తి ఉండేది..ఫలానా రామోజీరావు ఈటీవీ న్యూస్ పెడుతున్నాడు, ఫలానా రవి ప్రకాష్ టీవీ9 ఛానల్ ఓపెన్ చేస్తున్నాడు అనే మౌత్ పబ్లిసిటీ అప్పట్లో బాగా జరిగేది

రవిప్రకాష్ Rtv పేరుతో శాటిలైట్ ఛానల్ వస్తుంది అని అందరూ ఎదురు చుస్తున్నారు .. RTv డిజిటల్ ల్లో దూసుకుపోతున్న స్క్రీన్ పై రవిప్రకాష్ కనిపించి చేసే హడావుడి..TV9 ను తలదన్నేలా స్టూడియో లు ఉన్నాయన్న వార్తలు రావడం తో కొంత ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు..ఒకరకంగా చెప్పాలంటే టివి చానల్స్ లో లెజెండ్ అంటే రవిప్రకాష్ అనే చెప్పుకోవాలి గంట న్యూస్ చూడాలి అంటే అమ్మో అనుకున్న రోజుల్లో 24 గంటల న్యూస్ అని పెదవి విరిచారు ఆలాంటి వాళ్ళనీ TV9 రాకతో ఆడవాళ్ళు సీరియల్స్ మగవాళ్ళు న్యూస్ చానల్స్ చూసే స్థాయికి తీసుకొని వెళ్ళారు రవిప్రకాష్ .ఎలాంటి క్రైమ్ జరిగిన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత పెద్ద ఇష్యూ జరిగిన వెంటనే టివి9 పెట్టండి అని ప్రజలు అనుకునే స్థాయికి వెళ్ళింది అలా దేశం లో ప్రత్యేకం గుర్తింపు తెచ్చుకున్న TV9 అంత రవిప్రకాష్ చేసిన కృషి ఫలితమే..ఇప్పుడు టివి9 లో ఉన్న వాళ్ళు రవిప్రకాష్ గారు ఉద్యోగం ఇస్తే ఇప్పుడు వాళ్ళు అపోజిషన్ లో ఉన్నారు.. వాళ్ళకి గుర్తుందో లేదో అనుకొని పరిష్ఠితుల్లో అయ టివి9 నుండి బైకిటి వచ్చారు రవిప్రకాష్ టివి9 నుండి రావడం తో ఛానల్ కొంత ఉనికి కోల్పోయింది అని చెప్పుకోవాలి.మరి లోతుల్లోకి నేను వెళ్ళదలచుకొలేదు..మొత్తానికి Rtv లైసెన్స్ పై కోర్ట్ తీర్పు రవిప్రకాష్ అనుకూలంగా రావడం తో Rtv టివిల్లో ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు.. Rtv రిలీజ్ చేసిన ప్రోమో తో పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇంకా పెరిగిపోయింది..కచ్చితంగా ప్రజలు కోరుకునే కొత్తదనం తో ఛానల్ వస్తుందని ఎదురు చుస్తున్నరు

రవిప్రకాష్ Rtv logo

గతంలో ఏవైనా న్యూస్ చానల్స్ ప్రారంభమైతే జనాల్లో ఒక చర్చ జరిగేది. మౌత్ పబ్లిసిటీ ద్వారా వాటికి ఎక్కడా లేని క్రేజ్ వచ్చేది. ప్రైమ్ 9Tv , స్వతంత్ర టివి ల్లలో ఏమాత్రం కొత్తదం లేదు ఈ చానల్స్ కూడా ఎవరి ఎజెండా వారికి ఉంది అని సమాచారంనిన్నటికి నిన్న తెలుగు 360, బిగ్ టీవీ అనే రెండు శాటిలైట్ ఛానల్స్ ఓపెన్ అయ్యాయి. తనకి ఈ రెండు చానల్స్ లో బిగ్ టివి మేనేజ్మెంట్ ఆర్థికంగా చాలా బలమైనది ఒక NRI ది అంటున్న రేవంత్ రెడ్డి సపోర్ట్ కోసమే ఈ ఛానల్ అంటున్నారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని యాజమాన్యాల కంటే నూరు పాళ్ళు బిగ్ టివి నయం. కానీ TV9 వార్క్ చేసేవాల్లు బాగా వర్క్ చేస్తారు అని అచ్చుతప్పులు చదివే తడబడే వారికి ఎక్కువ సాలరీ తో తీసుకోవడం అచ్చర్యం వేసింది .. జనాలకి న్యూస్ ఛానల్స్ చూసే ఓపిక తగ్గిపోవడంతో వీటిని పెద్దగా పట్టించుకోలేనట్టు తెలుస్తోంది. అందువల్లే ఈ చానల్స్ ముందుగానే డిజిటల్ మీడియాలోకి ప్రవేశించాయి. అందులో కాస్త కూస్తో క్లిక్ అయిన తర్వాతే శాటిలైట్ ప్రసారాల్లోకి వెళ్లిపోయాయి. ఇవి మునుముందు ఎలా ఉంటాయనేది ఆ మేనేజ్మెంట్, అందులో పని చేస్తున్న పాత్రికేయుల మీద ఆధారపడి ఉంటుంది. ఒక్కటి మాత్రం సుస్పష్టం మీడియాను ఒకప్పటిలాగా జనం నమ్మే పరిస్థితి లేదు. అరచేతిలో సోషల్ మీడియా ఉండడంతో వారు ప్రతి విషయాన్ని దాని ద్వారానే బేరీజు వేసుకుంటున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular