ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో చార్‌ధామ్ ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న సొరంగం కూలిపోయిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 40 మంది కార్మికులు చిక్కుకుని 5 రోజులు కావొస్తుంది.రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. కేంద్ర, రాష్ట్ర బలగాలు కలిసి భారీ ఆపరేషన్స్ చేపట్టి శ్రమిస్తున్నారు. మరోవైపు థాయ్‌లాండ్, నార్వేకు చెందిన నిపుణుల బృందాల సహాయం కూడా తీసుకుంటున్నారు. చిక్కుకుపోయిన వారికి శిథిలాల గుండా పెద్ద పైపుల ద్వారా ఆక్సిజన్, ఫుడ్ సప్లై చేస్తునే ఉన్నారు.
కాగా, వారంతా క్షేమంగానే ఉన్నారని కల్నల్ దీపక్ పాటిల్ వెల్లడించారు. అయితే 40 మంది ఆరోగ్యంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. భాదితుల కుటుంబీకులు, కార్మికులు టన్నెల్ వద్ద నిరసన చేపట్టారు. అధికారులు వచ్చి వారికి నచ్చజెప్పి పంపించారు. మరోవైపు ఈ ఘటనపై సీఎం పుష్కర్ సింగ్ ధామి ఇవాళ అధికారులతో రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేశారు.
చార్‌ధామ్ ప్రాజెక్టులో సొరంగంలో 40 ప్రాణాలు.. 5వ రోజుకు చేరిన రెస్క్యూ ఆపరేషన్!
RELATED ARTICLES