ప్రేమించిన మనిషి కోసం త్యాగం చెయ్యడం మామూలే కానీ ఓడి చాలా దారుణ మైన త్యాగం సభ్యసమాజం తలదించకునే సంఘటన..ఒకరి కోసం మరొకరు త్యాగం చేయడంలో ప్రేమికులు కానీ ఈ స్టోరీ చదివితే ఛీ అని అంటారు అయితే అసలు డీటైల్స్ లోకి వెళ్దాం
ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్‌కు చెందిన ఓ బిజినెస్ మ్యాన్ తన భార్యతో కలిసి ఉంటున్నాడు. కోటీశ్వరుడైన ఆయన ఇంట్లో గత వారం ఆరుగురు దొంగలు చొరబడి రూ.10 లక్షల నగదుతోపాటు నగలు, విలువైన వస్తువులను చోరీ చేశారు. దొంగతనం అనంతరం ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆయన భార్యపై ఆరుగురు దుండగులు సామూహిక అత్యాచారం చేశారు. ఆమె శరీరంపై సిగరేట్ పీకలతో కాల్చారు. ఈ విషయం విన్న ఆ బిజినెస్ మ్యాన్ వెంటనే బిజ్నోర్ ఎస్పీ నీరజ్ కుమార్ జదౌన్‌కు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి క్లూస్ సేకరించారు.
అయితే ఫిర్యాదులో పేర్కొన్న దానికి, ఘటన స్థలంలో జరిగిన దానికి ఎక్కడా పొంతన లేకపోవడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. మరోవైపు గ్యాంగ్ రేప్ జరిగిందని చెప్పిన బిజినెస్ మ్యాన్ భార్యను ఆస్పత్రికి తరలించగా.. ఆమెపై ఎలాంటి అత్యాచారం జరగలేదని.. యోనిపై కూడా గాయాలు, వీర్యం లేదని మెడికల్ టెస్ట్‌లో తేలింది. దీంతో పోలీసులు ఆమెపై నిఘా వేయడంతోపాటు ఫోన్ కాల్స్ రికార్డును పరిశీలించారు. అంతే.. ఆ రోజు సాయంత్రం ఏం జరిగిందో తేలిపోయింది.
ఈ సంచలన ఘటనపై మీడియా సమావేశం ఏర్పాటు చేసిన బిజ్నోర్ ఎస్పీ నీరజ్ కుమార్ జదౌన్ సంచలన విషయాలు వెల్లడించారు. ”అసలు బిజినెస్ మ్యాన్ ఇంట్లో చోరీ, సామూహిక అత్యాచారం జరగలేదు. సాయంత్రం సమయంలో ఈ ఘటన జరిగిందని ఫిర్యాదులో చెప్పారు. కానీ ఆ సమయంలో ఆ ప్రాంతమంతా రద్దీగా ఉన్నది. అలాంటప్పుడు ఆరుగురు వ్యక్తులు వచ్చి దొంగతనం, అత్యాచారం చేయడం అస్సలు కుదరదు. సీసీ టీవీ ఫుటేజీలోనూ ఆ ఆనవాళ్లు ఎక్కడా కనిపించలేదు. ఘటన జరిగింది అని చెప్పిన సమయంలో బిజినెస్ మ్యాన్ భార్య ఆమె ప్రియుడితో ఫోన్‌లో మాట్లాడుతుంది. అతడికైన అప్పులను తీర్చడం కోసమే ఇద్దరు కలిసి దోపిడీ, అత్యాచారం నాటకం ఆడారు. దీనిని నమ్మించడానికి తన ప్రియుడితో ఆమె తన ఒంటిపై సిగరేట్ పీకలతో కాల్చుకోని గాయాలు చేసుకుంది.” అని ఎస్పీ వివరించాడు. విషయం బయటపడటంతో బిజినెస్ మ్యాన్ భార్య పోలీసులకు లొంగిపోగా.. ఆమె ప్రియుడు పుష్పేంద్ర చౌదరి (32)ని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రియుడి అప్పులు తీర్చేందుకే ఆమె ఉత్తుత్తి గ్యాంగ్ రేప్ చేయించుకుందని పోలీసులు వెల్లడించారు.