ఓ యువతి మూడేళ్ల క్రితం అత్యాచారానికి గురైంది. ఈ ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. తనపై కేసు పెట్టిందని కోపం పెంచున్న వ్యక్తి తాజాగా ఆ యువతిని అతి దారుణం గొడ్డలితో నరికి హత్య చేశాడు.కౌషంబి జిల్లాలోని థేర్హా గ్రామంలో నివాసం ఉంటున్న 19 ఏళ్ల యువతిని.. మూడేళ్ల క్రితం తను మైనర్‌గా ఉన్నప్పుడు పవన్ నిషాద్ అనే వ్యక్తి సన్నిహితులతో కలిసి రేప్ చేశాడు. ఈ ఘటనతో యువతి పోలీసులకు ఫిర్యాదు చెయ్యడంతో అతడు ఆమెను వేధించడం మొదలు పెట్టాడు. ఇక పవన్ జైలుకి వెళ్లిన తర్వాత అతడి కుటుంబసభ్యులు ఆ యువతిని కేసు వెనక్కి తీసుకోవాలంటూ వేధించారు.
అయినా ఆ యువతి కేసు వెనక్కి తీసుకోకపోవడంతో ఆమెను చంపాలని యువకుడు ఫిక్స్ అయ్యాడు. ఇందుకోసం అతడి సోదరుడు అశోక్ నిషాద్ సాయం తీసుకోవాలి అనుకున్నాడు. అయితే.. అశోక్ కూడా మరో కేసులో జైలుకు వెళ్లాడు. ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితం అశోక్ జైలు నుంచి బయటకు వచ్చాడు. అదే సమయంలో పవన్ కూడా జైలు బయటే ఉండటంతో యువతిని చంపాలని ప్లాన్ చేశాడు. యువతి పశువులను మేతకు తీసుకెళ్లి ఇంటికి తిరిగివస్తున్న క్రమంలో నిందితులు ఆమెపై గొడ్డలితో దాడి చేసి అతి కిరాతంగా హత్య చేశారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం యువతి మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు అయితే.. ‘బాధితురాలు, నిందితులు ఒకటే కులానికి చెందిన వారు. రెండు వర్గాల మధ్య పాత గొడవలు ఉన్నాయి. ఒక వర్గం తరఫు వ్యక్తులు యువతిని పదునైన గొడ్డలితో దాడి చేసి హత్య చేశారని’ పోలీసులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులు పవన్, అశోక్‌లు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు తెలిపారు.
తనపై కేసు పెట్టిందని యువతిని అతి దారుణం గొడ్డలితో నరికి హత్య చేశాడు.
RELATED ARTICLES