క్షణికావేశంలో ఓ తండ్రి తన కన్న కుమారుల పట్ల దారుణానికి ఒడిగట్టాడు..భార్యతో గొడవ పిల్లల ప్రణలని తీసేసింది.
ఘటన ఢిల్లీలోని దేశ రాజధానిలో జరిగింది. వివరాల్లోకెళ్తే.. ‘ఢిల్లీలోని భరత్ నగర్‌లో వజీర్‌నగర్ జె. జె కాలనీలో 35 ఏళ్ల వ్యక్తి ఇన్వర్టర్ మెకానిక్‌గా పని చేస్తున్నాడు. ఆయన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి జీవిస్తున్నాడు. ఇటీవల తన భార్యతో గొడవపడి.. మనస్థాపానికి గురైన ఆయన రెండు, ఐదేళ్ల వయస్సున్న ఇద్దరు పిల్లల గొంతు కోశాడు. అనంతరం అతడు ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో చిన్న కుమారుడు మరణించగా.. నిందితుడు, పెద్ద కుమారుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. సోమవారం భర్తతో గొడవ పెట్టుకుని భార్య వారి బంధువుల ఇంటికి వెళ్లడంతో ఇదే సరైన సమయమని అతడు పిల్లలపై పదునైన కత్తితో దాడి చేశాడని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం కేసుకు సంబంధించిన వివరాలు సేకరిస్తున్నామని చెప్పారు.