దారుణం జరిగింది. కట్నం తీసుకురావాలని వేధిస్తూ భార్య ప్రైవేట్ పార్ట్స్‌పై ఓ కసాసి భర్త యాసిడ్ పోశాడు. ఈ సంఘటన బెంగళూరు శివార్లలోని బాగలగుంటె పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు భర్త, అత్తపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు 23 ఏళ్ల బాధితురాలిని ఈ ఏడాది మే 19న వివాహం చేసుకున్నాడు. నిందితుడు మద్యానికి అలవాటు పడ్డాడని, అతను చాలా అరుదుగా పనికి వెళ్లేవాడని పోలీసులు తెలిపారు.దీంతో అతను తాగేందుకు డబ్బులు లేకపోవడంతో తన భార్య నుండి డబ్బు డిమాండ్ చేశాడు. ఇలా తరుచు డబ్బులు తీసుకురావాలని గొడవ పడుతూ ఉండేవాడని పోలీసులు తెలిపారు. అయితే నిన్న నిందితుడు మద్యం మత్తులో ఇంటికి తిరిగి వచ్చి.. తన భార్యను శారీరక, మానసిక వేధింపులకు గురిచేశాడు. తరచూ జుట్టు పట్టుకుని లాగి చంపేస్తానని బెదిరించేవాడని ఆ మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది. ఇంటి అద్దె చెల్లించకపోవడంతో తమను నివాసం నుంచి వెళ్లగొట్టారని ఆమె ఆరోపించారు. తన భర్త తన ప్రవేట్ పార్ట్స్‌పై టాయిలెట్ క్లీనింగ్ యాసిడ్ పోసినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిపై వరకట్న వేధింపులు, శారీరక వేధింపుల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో తదుపరి విచారణ కొనసాగుతుందని పోలీసులు తెలిపారు.