పెళ్లి చేసుకుంటానని నమ్మించి, యువతితో అసహజ లైంగిక సంబంధం పెట్టుకోవడంమే కాకుండా, పెళ్లి కోసమ మతం మారాలని ఒత్తిడి చేస్తున్న ఓ వ్యక్తిని బెంగళూర్ పోలీసులు అరెస్ట్ చేశారు.
జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్ ప్రాంతానికి చెందిన 32 ఏళ్ల మొగిల్ అష్రఫ్ బేగ్ అనే వ్యక్తి బెంగళూర్ లోని టెక్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అతనికి బాధిత యువతితో 2018 నుంచి పరిచయం ఉంది. ఇద్దరూ లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్నారు. సదరు యువతి కూడా బెంగళూర్ లోనే ఓ టెక్ కంపెనీలో పనిచేస్తుంది.
అయితే వీరిద్దరు వివాహం చేసుకోవాలని యోచిస్తున్నారు. కాగా, అష్రఫ్ యువతిని బలవంతంగా ఇస్లాం మతంలోకి మారాలని వేధిస్తున్నాడు. తనతో లైంగిక సంబంధం పెట్టుకునేందుకు పెళ్లిని సాకుగా వాడుకున్నాడని యువతి ఆరోపిస్తోంది. అష్రఫ్ తనను ‘అసహజ లైంగిక చర్యలు’ పెట్టుకోవాలని బలవంతం చేశాడని, అతని సోదరుడితో ఫోన్ లో బెదిరించాడని యువతి ఆరోపించిందని సీనియర్ పోలీస్ అధికారి వెల్లడించారు.