చేపల పులుసు బిజినెస్ లో ఫైల్ అయిన జబర్దస్త్’ కమెడియన్, ప్రస్తుత సినీ దర్శకుడు కిరాక్ ఆర్పీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన ఇటీవల తెగ హైలైట్ అవుతున్నారు.
కిర్రాక్ ఆర్పీ గోప్యంగా పెళ్లి చేసుకున్నారు. ప్రేమించిన అమ్మాయి లక్ష్మీ ప్రసన్నను విశాఖపట్నంలో ఘనంగా వివాహం చేసుకున్నాడు. వైజాగ్‌లో సముద్ర తీరాన ప్రేయసిని పెళ్లాడారు ఆర్పీ. లక్ష్మీ ప్రసన్నతో కిందటేడాది మే నెలలో ఆర్పీ నిశ్చితార్థం కాగా, పెళ్లి మాత్రం కాస్త గోప్యంగా వైజాగ్‌లో చేసుకున్నాడు ఆర్పీ.
ఆర్పీ వివాహానికి కేవలం ఇరు కుటుంబాలు, బంధుమిత్రులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. ప్రస్తుతం వీరి జంటకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతుండగా, నూతన జంటకి పలువురు జబర్దస్త్ కమెడియన్లు, సినీ ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక లక్ష్మీ ప్రసన్నతో ఆర్పీకి ఎలా పరిచయం, ప్రేమ ఏర్పడింది అనే విషయాన్ని గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలియజేశాడు. తనది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని, హైదరాబాద్‌లోని ఆర్‌సీ రెడ్డి కోచింగ్ సెంటర్‌లో ఆమెని మొదటిసారి చూశానని.. చూసిన వెంటనే ఆమెతో ప్రేమలోచూసిన వెంటనే ఆమెతో ప్రేమలో పడిపోయినట్టు చెప్పుకొచ్చారు. లక్ష్మీ ప్రసన్న ఆర్‌సి రెడ్డి కోచింగ్ సెంటర్‌లో సివిల్స్ కోచింగ్ తీసుకుంటున్న సమయంలో ఓ కార్యక్రమానికి ఆర్పీ అతిథిగా వెళ్లగా, అక్కడ ఆమెని చూసి ఫ్లాట్ అయిపోయాడట.
తర్వాత లక్ష్మీ ప్రసన్న ఫోన్ నెంబర్ అడగగా, ఆమె తన తల్లి నెంబర్ ఇవ్వడంతో ఆమెతో మాట్లాడి మంచి అనుబంధం ఏర్పరచుకొని ఏడాది తర్వాత అసలు విషయాన్ని చెప్పాడట ఆర్పీ. అయితే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి కావడంతో ముందు వారు ఆర్పీకి తమ కూతురిని ఇచ్చి పెళ్లి చేసేందుకు ఇష్టపడలేదట. కాని రెండేళ్ల పాటు పోరాటం చేసి ఆర్పీ, లక్ష్మీ ప్రసన్న తమ పెళ్లికి పెద్దలను ఒప్పించి చివరికి పెళ్లి చేసుకున్నారు.ఈ ఇద్దరు నూరేళ్ల పాటు చిలకా గోరింకల్లా కలిసి మెలిసి ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు.