ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సైడ్ ఎఫెక్ట్స్పై రోజురోజుకు ఆందోళనలు పెరుగుతున్న సమయంలో.. ఓ షాకింగ్ వార్త బయటకొచ్చింది.టెక్నాలజీ పెరుగుతున్న కొద్ది సంతోష పడాల.. అటేక్నాలజి వల్లంజరిగే అనర్థాలు కూడా ఇప్పుడు ఎక్కువ అవుతున్నాయి..
ఇప్పుడు లేటేష్ట్ మొబైల్లో మనం యాప్స్ వాడుతున్నా0..ఒకరకంగా చెప్పాలి అంతే యాప్స్ యుగం అని చెప్పుకోవచ్చు..ఒకప్పుడు కప్యుటర్ లో వెబ్సైట్ లు వాడే యుగం పోయి మన చేతుల్లో ఉన్న మొబైల్స్ లో యాప్స్ ద్వారా అనేక రకాల లేటెస్ట్ సాఫ్ట్వేర్ లకు కనెక్ట్ అవుతున్నాం..
ఇప్పుడు కొత్తగా వచ్చిన AI టెక్నాలజీ బేస్డ్ యాప్ సంచలనం గా మారింది..దానిలో ఇప్పుడు ఫొటోల్లో.. మహిళల దుస్తులను తొలగించే ఏఐ ఆధారిత యాప్స్, వెబ్సైట్స్కు యూజర్ల సంఖ్య భారీగా పెరుగుతోందని సోషల్ నెట్వర్క్ ఎనాలసిస్ కంపెనీ గ్రాఫికా రీసెర్చ్లో తేలింది. ఒక్క 2023 సెప్టెంబర్లోనే.. ఈ తరహా వెబ్సైట్స్ని ఏకంగా 24 మిలియన్ మంది వాడినట్టు ఓ నివేదికను ప్రచురించింది గ్రాఫికా.
గ్రాఫిక నివేదిక ప్రకారం ఇలాంటి యాప్ లు న్యూడిఫై యాప్స్, వెబ్సైట్స్.. మార్కెటింగ్, ప్రొమోషన్ కోసం ప్రముఖ సోషల్ మీడియా సైట్స్ని వాడుకుంటున్నాయి. ఉదాహరణకు.. ఎక్స్ (ట్విట్టర్), రెడ్డిట్ వంటి సోషల్ మీడియా సైట్స్లో.. అన్డ్రెస్సింగ్ యాప్స్ లింక్స్కు చెందిన యాడ్లు ఈ ఏడాది నుంచి ఇప్పటివరకు 2,400శాతం పెరిగాయి!
ఏదైనా ఫొటోను అప్లోడ్ చేస్తే.. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ని వాడుకుని, అందులోని వ్యక్తిని న్యూడ్గా చూపిస్తున్నాయి ఈ యాప్స్, వెబ్సైట్స్. వీటిల్లోని చాలా వరకు యాప్స్.. కేవలం మహిళల ఫొటోలను తీసుకునే విధంగా రూపొందించడం జరిగింది!
డీప్ఫేక్, డీప్ఫేక్ పార్నోగ్రఫీపై ఇప్పటికే సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతున్న తరుణంలో.. ఇలాంటి యాప్స్ మరింత తలనొప్పిగా మారాయి. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వాడకం పెరుగుతున్న కొద్ది, ఆన్లైన్లో ఏది నిజం, ఏది అబద్ధం అన్నది తెలుసుకోవడం చాలా కష్టమైపోతోందని ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి.
ఇలా.. అన్డ్రెస్సింగ్ యాప్స్నకు డిమాండ్ పెరుగుతుండటంతో.. ఇలాంటివి మరిన్ని శరవేగంగా పుట్టుకొస్తున్నాయని గ్రాఫికా.. తన నివేదికలో వెల్లడించింది. ఈ తరహా యాప్స్ని తయారు చేసేందుకు ఉపయోగించే సాఫ్ట్వేర్స్.. సులభంగా, ఉచితంగా అందుబాటులో ఉండటం కూడా ఆందోళనకర విషయం అని పేర్కొంది.
Undressing women apps AI : “ఒకప్పుడు ఫొటోలను మార్ఫ్ చేసినా, డీప్ఫేక్ చేసినా.. కాస్త బ్లర్గా కనిపించేవి. కానీ ఇప్పుడు వస్తున్న యాప్స్ చాలా దారుణంగా ఉన్నాయి. ఆ ఫొటోలు చూస్తే.. అవే నిజమైనవి అని అనుకునే విధంగా రియలిస్టిక్గా ఉంటున్నాయి,” అని గ్రాఫికా తెలిపింది.
మహిళల దుస్తులను తొలగించే యాప్స్.. ఫ్రీ అయినా, పెయిడ్ అయినా.. బీభత్సంగా డిమాండ్ కనిపిస్తోందట! నెలకు రూ. 1000 వరకు ఛార్జ్ చేసే పెయిడ్ యాప్స్లో కూడా యూజర్ల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోందని తెలుస్తోంది.
ఈ యాప్స్ బారిన పడుతున్న మహిళల్లో చాలా మందికి తాము బాధితులము అన్న విషయం కూడా తెలియదు. తెలిసిన వారు న్యాయపరంగా చర్యలు తీసుకోవాలని భావించినా.. అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి.