మహాదేవ్ యాప్ ఆన్‌లైన్ బెట్టింగ్ కేసును విచారిస్తున్న ముంబయి సైబర్ సెల్ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్‌తో పాటు మరో ముగ్గురికి సమన్లు జారీ చేసింది.
వారిని శుక్రవారం సిట్ ఎదుట విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో మ్యాచ్ ఫిక్సింగ్, అక్రమ హవాలా, క్రిప్టోకరెన్సీ లావాదేవీలతో పాటు 15,000 కోట్ల రూపాయల మోసం జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి
శుక్రవారం ముంబై సైబర్ సెల్ స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీమ్ ముందు విచారణకు హాజరు కావాలని నటుడు సాహిల్ ఖాన్ మరియు అతని సోదరుడు సామ్ ఖాన్‌లను ఆదేశించారు. వారితో పాటు హితేష్ ఖుసలానీ, అమిత్ శర్మలను శుక్రవారం సిట్ ఎదుట విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.ఎఫ్‌ఐఆర్‌లో మొత్తం 31 మంది వ్యక్తుల పేర్లను నమోదు చేశారు. ఈ కేసులో ముంబయి పోలీసులు తమ దర్యాప్తును ముమ్మరం చేశారు
ఈడీ ఆదేశాల మేరకు ఇంటర్‌పోల్ జారీ చేసిన రెడ్ కార్నర్ నోటీసు ఆధారంగా దుబాయ్ పోలీసులు ప్రధాన యజమాని అయిన రవి ఉప్ప్ ను అరెస్టు చేసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. రవి ఉప్పల్‌ను త్వరలో భారత్‌కు రప్పించనున్నారు. రవి ఉప్పల్ మనీలాండరింగ్ కేసును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారిస్తోంది. ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్‌పై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆయనను నిందితుడిగా చేర్చారు.ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు రాయ్‌పూర్‌లోని ప్రత్యేక కోర్టును ఆశ్రయించి వారిపై నాన్-బెయిలబుల్ వారెంట్ పొందారు. నిందితులిద్దరికి రెడ్ కార్నర్ నోటీసు జారీ చేశారు. రవి ఉప్పల్ అరెస్ట్ తర్వాత చంద్రాకర్ త్వరలో అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని సమాచారం.