Big బాస్ లో మొత్తం 19 మంది కంటెస్టెంట్లతో మొదలైన ఈ షోలో ఇప్పుడు ఆరుగురు కంటెస్టెంట్స్ మిగిలారు. అమర్, శివాజీ, యావర్, ప్రశాంత్, అర్జున్, ప్రియాంక ఫైనలిస్ట్స్ కాగా.
అత్యధిక ఓటింగ్‌తో అమర్, పల్లవి ప్రశాంత్ టైటిల్ రేసులో చివరికి పల్లవి ప్రశాంత్ విన్ అయ్యాడు.బిగ్ బాస్ లో ఆరవ స్థానంలో అర్జున్ అంబటి ఎలిమినేట్ కాగా.. ఆ తర్వాత ఐదవ స్థానంలో ప్రియాంక ఎలిమినేట్ అయ్యింది. వీరిద్దరికి పది లక్షల సూట్ కేసు ఆఫర్ ఇచ్చారట. కానీ ఇద్దరు తిరస్కరించి ఖాళీ చేతులతో బయటకు వచ్చేశారు. వీరిద్దరి ఎలిమినేషన్ తర్వాత మిగిలిన నలుగురు అమర్, శివాజీ, యావర్, ప్రశాంత్ ముందు రూ.15 లక్షల సూట్ కేసు ఆఫర్ ఇచ్చారు యావర్ రూ.15 లక్షల సూట్ కేసు తీసుకుని ఎలిమినేట్ అయ్యాడు. తర్వాత మూడో స్థానంలో శివాజీ ఎలిమినేట్ అయ్యాడు. ఇక ఇప్పుడు ప్రశాంత్, అమర్ ఇద్దరిలో చివరకు ప్రశాంత్ విన్నర్ గా నిలచాడు .