spot_img
Monday, July 21, 2025
spot_img

ఫోన్ నంబర్ ఉంటే చాలు యూజర్ లొకేషన్ కనిపెట్టేయొచ్చు! డీటైల్స్ కోబ్రా న్యూస్ లో

ఆండ్రాయిడ్ యూజర్లు అందరికీ గుడ్ న్యూస్. Google Contacts App యూజర్ ఫోన్ నంబర్ ఆధారంగా, అతని కరెంట్ లొకేషన్ను ట్రాక్ చేసే ఫీచర్ను అందుబాటులోకి తెచ్చింది.

మరి ఈ ఫీచర్ను ఎలా ఉపయోగించాలి? దీని వల్ల కలిగే ఉపయోగాలు ఏమిటో ఇప్పుడు వివరంగా కోబ్రా న్యూస్ లో తెలుసుకుందాం.

Google Contacts App Latest Feature : మనం కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా విహారయాత్రకు వెళతాం. లేదా ఏదైనా ఫంక్షన్​కు వెళతాం. మనతో వచ్చిన పిల్లలు లేదా పెద్దలు అప్పుడప్పుడూ తప్పిపోతూ ఉంటారు. దీనితో వాళ్లు ఎక్కడ ఉన్నారో తెలియక, చాలా కంగారు పడిపోతూ ఉంటాం.

కొన్నిసార్లు మనం కొత్త ఊరు వెళతాం లేదా సిటీకి వెళ్తాం. ఫ్రెండ్​ రూమ్​కు వెళ్లాల్సి ఉంటుంది. కానీ అతను/ ఆమె ఫోన్ లిఫ్ట్ చేయకపోతే, వారి లొకేషన్ తెలియక ఇబ్బందిపడుతూ ఉంటాం. ఈ సమస్యకు చెక్ పెడుతూ ‘గూగుల్ కాంటాక్ట్స్​ యాప్’​ సరికొత్త ఫీచర్​ను అందుబాటులోకి తెచ్చింది. కేవలం ఫోన్ నంబర్ ఉంటే చాలు, సదరు యూజర్​ కరెంట్​ లొకేషన్​ను ఈ ఫీచర్​ ద్వారా తెలుసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

ఫీచర్ ఎనేబుల్ చేసుకోండిలా!
How To Enable Google Contacts Live Tracker Feature : గూగుల్ కాంటాక్ట్స్ యాప్ 4.22.37.586680692 వెర్షన్ను అప్డేట్ చేసుకున్న ఆండ్రాయిడ్ యూజర్లకు ఈ నయా ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. దీనిని ఎలా ఎనేబుల్ చేసుకోవాలంటే? వివరాలు తెలుసుకోండి..ఇలా

1) ముందుగా మీ ఆండ్రాయిడ్ ఫోన్లోని Settings ఓపెన్ చేయాలి.
2) Apps సెక్షన్లోని Google Contacts ను సెలెక్ట్ చేసుకోవాలి.వెంటనే మీకు యాప్ ఇన్ఫో కనిపిస్తుంది. దీనిలోనే గూగుల్ కాంటాక్ట్స్ యాప్ వెర్షన్ నంబర్ కనిపిస్తుంది.
లేటెస్ట్ 4.22.37.586680692 వెర్షన్ ఉంటే ఓకే. లేదంటే వెంటనే ఫోన్ను అప్డేట్ చేసుకోండి. అంతే సింపుల్!

ఒక వేళ యాప్ అప్డేట్ చేసినా 4.22.37.586680692 వెర్షన్ రాకపోతే, మీరేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఈ లేటెస్ట్ వెర్షన్ ఒక క్రమ పద్ధతిలో రోల్అవుట్ అవుతోంది. కనుక త్వరలోనే మీకు కూడా ఇది అందుబాటులోకి వస్తుంది. మీ ఫోన్లో కనుక గూగుల్ కాంటాక్ట్స్ యాప్ లేనట్లయితే.. గూగుల్ ప్లే స్టోర్కు వెళ్లి, లేటెస్ట్ వెర్షన్ను డౌన్లోడే చేసుకోవచ్చు.

ఎవరి లొకేషన్ ట్రేస్ చేయవచ్చో తెలుసా అయితే ఈ వివరాలు చూడండి..
ఈ నయా ఫీచర్తో మీ జీ-మెయిల్లో, ఫోన్ కాంటాక్ట్ లిస్ట్లో ఉన్నవారి కరెంట్ లొకేషన్ను మీరు తెలుసుకోవచ్చు. అలాగే ఇంతకు ముందు ఎవరైతో తమ లొకేషన్ను గూగుల్ మ్యాప్స్ ద్వారా మీకు షేర్ చేశారో, వారి కరెంట్ లొకేషన్ను కూడా మీరు ట్రాక్ చేయగలుగుతారు.

లైవ్ లొకేషన్ను ఎలా ట్రాక్ చేయాలో తెలుసా ఈ క్రింది వివరాలు ఫాలో చేయండి..
How To Track Live Location With Google Contacts :

1) ముందుగా మీరు గూగుల్ కాంటాక్ట్స్ యాప్ ఓపెన్ చేయాలి.

2)) మీరు ఎవరి లొకేషన్ తెలుసుకోవాలని అనుకుంటున్నారో, వారి ఫోన్ నంబర్ను ట్యాప్ చేయాలి.

3)వెంటనే మీకు యూజర్ ఫొటో, అతని కాంటాక్ట్ వివరాలు కనిపిస్తాయి.

4) అక్కడే Google Maps. Location Sharing ఆప్షన్ కూడా కనిపిస్తుంది.

5)ఈ గూగుల్ మ్యాప్స్ లింక్ను ఓపెన్ చేస్తే, వెంటనే సదరు యూజర్ ఉన్న కరెంట్ లొకేషన్ మీకు కనబడుతుంది.

6)మనం సదరు యూజర్ ఉన్న లొకేషన్కు వెళ్లాలంటే.. గూగుల్ మ్యాప్స్ అతను/ ఆమె ఉన్న డైరెక్షన్ను కూడా చూపిస్తుంది.

ఏదైనా మంచికి వాడితే పర్లేదు కానీ..అసాంఘిక శక్తులు కూడా ఇదేవిధంగా ట్రాక్ చేసే అవకాశం ఉంది..ముఖ్యంగా అవరాగాల్లు అమ్మాయిల ఫాలో అవుతూ ఇబ్బంది పెట్టే అవకాశం కూడా లేకపోలేదు అలా ఎవరి నంబర్ అయిన బ్లాక్ చేస్తే రాదు అంటున్న ఇంకా కొన్ని సెక్యూర్టీ గా ఈ మొబైల్ ట్రాక్ పెడితే బాగుంటుంది పోలీసులు కూడా ఈ దీనిపై దృష్టి సారించాలి అని కోబ్రా న్యూస్ కోరుకుంటుంది

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular