spot_img
Monday, July 21, 2025
spot_img

ఫేస్‌బుక్, ఇన్‌స్టాలు పర్సనల్ డేటాను తీసుకుంటాయా? అసలు నిజం ఇదే(వీడియో తో సహా)

ఫోన్లోని ప్రతి యాప్ మీ వ్యక్తిగత సమాచారాన్ని కొంత అడుగుతుంది. అవి తప్పనిసరిగా వాటిలో నమోదు చేయాల్సి ఉంటుంది. అవి ఇవ్వకపోతే యాప్ ఇన్ స్టాల్ కాదు. కొత్తగా వచ్చిన సెట్టింగ్ ప్రకారం గూగుల్ ప్లే స్టోర్ లో ఏ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న మన మొబైల్లో ఎలాంటి డేటా సేకరిస్తామన్నది ముందుగా తెలియజేయాలని గూగుల్ యాప్ స్టోర్ కొత్త నిబంధన పెట్టింది మన మొబైల్లో లొకేషన్ పర్సనల్ డేటా ..కెమెరా ఫైనాన్షియల్ డీటెయిల్స్ ఏమేమి సేకరిస్తున్నాము అవన్నీ కూడా ప్రైవసీ పాలసీ పో ముందు ఇన్ఫోలో ఉంటాయి అది తెలిసి కూడా ఆ యాప్ ఇన్స్టాల్ చేస్తే మనం ఎలాంటి రిస్క్లో పడ్డాము తెలుస్తుంది దీని సంబంధించి ఇంస్టాగ్రామ్ ఇన్స్టాల్ చేస్తే ఎలాంటి ఇన్ఫర్మేషన్ మన మొబైల్ నుంచి సేకరిస్తుందో ఈ వీడియోలో చూద్దాం

Instagram మన మొబైల్ నుందిందేకరించే సమాచారం వీడియో

చూశారుగా ఈ వీడియోలో మన పర్సనల్ డేటా క్రెడిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ ఆడియో వీడియో మన హెల్త్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా సేకరిస్తుంది అని చెప్పేసి అని ఇన్స్టిట్యూషన్ ముందే ఇన్ఫోలో ఎంత స్పష్టంగా పేర్కొన్నారు అంటే మనం ఒక యాప్ ఇన్స్టాల్ చేసేటప్పుడు మన ఏ రకంగా మన ఇన్ఫర్మేషన్ మొత్తం సదరు యాప్ నిర్వాహకులకు మన మొబైల్ ద్వారా మన పర్సనల్ డేటా ఇన్ఫో మొత్తం ఇస్తున్నాము ఈ వీడియో ద్వారా మనకు స్పష్టమవుతుంది

సోషల్ మీడియా యాప్ ల దగ్గర నుంచి ఆఫీస్ యాప్స్, కొన్ని టూల్స్, ఎడిటింగ్ యాప్స్ అన్నింట్లోనూ వినియోగదారుల డేటా ను అడుగుతుంది. అయితే ఏ యాప్స్ లో చాలా తక్కువ సమాచారం అడుగుతుంది? ఏ యాప్ వినియోగదారులకు సంబంధించిన ఎక్కువ సమాచారం తమ యాప్ లలో నిక్షిప్తం చేస్తుంది? తెలుసుకోవడం ముఖ్యం. ఎందుకంటే ప్రస్తుతం ఈ యాప్స్ కూడా ప్రమాదకరంగా పరిణమిస్తున్నాయి. ఈ క్రమంలోనే సర్ఫ్‌షార్క్ అనే సైబర్ సెక్యూరిటీ సంస్థ ఓ సర్వే చేసింది. యాప్ లు స్వీకరించే డేటా విధానాలను అధ్యయనం చేసింది. దాదాపు 100 ప్రముఖ యాప్ లపై ఈ అధ్యయనం చేసి ఓ నివేదికను వెలువరించింది. ఆ నివేదికలో విస్తు పోయే విషయాలు వెల్లడయ్యాయి. మన వ్యక్తిగత సమాచారాన్ని(డేటాను) అత్యధికంగా తీసుకుంటున్న యాప్స్ ఏంటో తెలుసా? అత్యధికంగా జనాలు వినియోగించే ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్.. ఈ రెండు యాప్స్ వినియోగదారుల డేటాను కూడా అధికంగా తీసుకుంటుందని చెప్పింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

యాపిల్ ప్రైవసీ పాలసీలో పేర్కొన్న 32 డేటా పాయింట్లను ప్రాథమికంగా తీసుకొని సర్ఫ్‌షార్క్ సైబర్ సెక్యూరిటీ సంస్థ ఈ అధ్యయనం చేసింది. వాటిల్లో సెన్సిటివ్ విషయాలైన పేమెంట్ డీటైల్స్, బ్రౌజింగ్ హిస్టరీ, మీ కచ్చితమైన లోకేషన్ వంటివి కూడా ఉన్నాయి. వీటి ఆధారంగా అధ్యయనం చేసి యాప్స్ కు ర్యాకింగ్ ఇచ్చింది.

మెటా యాజమాన్యంలోని ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ ప్లాట్‌ఫారమ్‌లలోనూ డేటా సేకరణ ఒకే విధంగా ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు. యాపిల్ ప్రైవసీ పాలసీలోని 32 డేటా పాయింట్ల బట్టి చూస్తే వాటన్నంటిని ఈ రెండు యాప్స్ సేకరిస్తున్నట్లు నిపుణులు గుర్తించారు. మరే ఇతర యాప్లలో కూడా ఇన్ని విధాలుగా డేటా పాయింట్లలో సమాచార సేకరణ లేదని చెబుతున్నారు.

అయితే రెండు యాప్‌లు జాబితా చేయబడిన అన్ని డేటా పాయింట్‌లను సేకరించినప్పటికీ, అవి పేరు, చిరునామా, ఫోన్ నంబర్‌తో సహా ట్రాకింగ్ ప్రయోజనాల కోసం ఏడు పాయింట్లను మాత్రమే ఉపయోగించాయని ఆ సంస్థ నివేదిక స్పష్టం చేసింది. ఎక్స్(ట్విట్టర్) మాత్రం అతి తక్కువ డేటాను వినియోగదారు నుంచి సేకరిస్తుందని తెలిపింది. అయితే థర్డ్ పార్టీ యాప్స్ తో భాగస్వామ్యం చేసినప్పుడు ఇది దాదాపు 32 డేటా పాయింట్లను సగం పాయింట్లను యూజర్ ట్రాకింగ్ కోసం వినియోగిస్తున్నట్లు గుర్తంచింది. దీంతో ఎక్స్ లో డేటా షేరింగ్ పద్ధతుల గురించి ఆందోళనలను పెంచుతుంది. దాదాపు 10 సోషల్ మీడియా, మెసేజింగ్ యాప్స్ లలో దాదాపు సగటు కంటే ఎక్కువ డేటాను సేకరిస్తున్నట్లు పరిశోధన వెల్లడించింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular