spot_img
Monday, July 21, 2025
spot_img

డీప్‌ ఫేక్‌తో 200 కోట్ల దోపిడీ ఏకంగా సీఎఫ్‌వోను క్లోన్‌ చేసి..ఫేక్‌ జూమ్‌ మీటింగ్‌

ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారిన డీప్‌ఫేక్‌ టెక్నాలజీకి సెలబ్రిటీలు, వీఐపీలే కాదు..ఏకంగా కంపెనీలు కూడా బోల్తా పడుతున్నాయి. తాజాగా హాంకాంగ్‌కు చెందిన ఓ మల్టీ నేషనల్‌ కంపెనీని ఈ డీప్‌ఫేక్‌ టెక్నాలజీతో దుండగులు బురిడీ కొట్టించారు. ఏకంగా రూ.200 కోట్ల (25.6 మిలియన్‌ డాలర్లు) సొమ్మును స్మార్ట్‌గా కొట్టేశారు. ఇందుకోసం కంపెనీ సీఎఫ్‌వోను డీప్‌ఫేక్‌ టెక్నాలజీతో క్లోన్‌ చేశారు.

ఆ కంపెనీ ఉద్యోగుల గొంతులు, రూపాలకు నకిలీలు సృష్టించారు. వీరంతా కలిసి కంపెనీలోని అకౌంటెంట్‌ ఉద్యోగితో జూమ్‌ మీటింగ్‌లో వారంపాటు పలు దఫాలుగా సమావేశమవుతూ హాంకాంగ్‌లోని 6 బ్యాంకు అకౌంట్లకు దాదాపు రూ.200 కోట్లు జమచేయించారు. అనుమానం వచ్చిన ఆ ఉద్యోగి పోలీసులకు ఫిర్యాదు చేయటంతో మోసం బయటపడింది. ఇప్పటివరకు నేరస్తులు ఎవరినీ అరెస్టు చేయలేదు అని పోలీసులు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular