తెనాలికి చెందిన గీతాంజలి ఆత్మహత్య కేసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. సోషల్ మీడియాలో ఆమె వివాదాస్పద సూసైడ్ కథనాలు (Geethanjali Suicide Case) ట్రెండింగ్ లోకి వస్తున్నాయి.సోషల్ మీడియా ట్రోలింగ్ (trolled in Social Media) వల్లే తన భార్య సూసైడ్ చేసుకుందని గీతాంజలి భర్త చెప్తున్నారు.. దీనిపై ఆయన పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. మృతురాలి భర్త ఫిర్యాదుతో విచారణ మొదలుపెట్టిన పోలీసులు ట్రోల్ చేస్తూ దూషించిన వారిని గుర్తించే పనిలో ఉన్నారు.
వైసీపీ నేతలు ఆమెకు సంఘీబావం ప్రకటించారు. సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో ఇవాళ ఆమె (Tenali Woman Gotti Geetanjali Devi) నివాసానికి వైసీపీ నేతలంతా వెళ్తున్నారు. విపరీతమైన ట్రోలింగ్‌తో వేధింపులకు గురి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు. స్థానిక MLAతో మాట్లాడి ఆ కుటుంబానికి అండగా నిలవాలని సూచించారు.
అసలేం జరిగింది: గీతాంజలి అసలు పేరు గొట్టి గీతాంజలి దేవి. తెనాలిలో నివాసం ఉంటుంది. ఆమె వయసు 29 ఏళ్లు. ఈమె భర్త బాలచంద్ర. బంగారం పని చేస్తుంటాడు. వీళ్లకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. అయితే గీతాంజలి ఇటీవలే ప్రభుత్వం నుంచి ఇంటి పట్టా అందింది. ఇటీవల వైసీపీ సభలో ఆమె ఇంటిస్థలం పట్టాకు కూడా అందజేశారు. దీంతో తన కల నెరవేరుతోందంటూ ఓ మీడియా ఛానల్ తో మాట్లాడుతూ తన సంతోషాన్ని వ్యక్తం చేసింది.