spot_img
Monday, July 21, 2025
spot_img

గోపాలపురం టీడీపీ మహిళా నేత హానీట్రాఫ్‌.. బాధితులు మామూలుగా లేరుగా

తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలో ఓ మహిళా నేత పొలిటికల్ హానీట్రాప్‌కు తెరలేపింది. నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ మహిళా నేత హనీట్రాప్‌లో పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు చిక్కుకొని విలవిల్లాడుతున్నారు అని సమాచారం.ఆ మహిళా నేత ముందుగా తీయటి మాటలతో కబుర్లు కలిపేస్తుంది.. తన మాటలతో ఐస్ చేసేస్తుంది. ఆ తర్వాత ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి… మీరు తప్ప నాకు ఎవరు ఉన్నారు.. మీరే ఆదుకోవాలంటూ అటు వైపు నేతలు ఎంతటి స్ట్రాంగ్ అయినా వాళ్లు కరిగిపోయేలా కబుర్లు చెపుతుంది.

పది పదిహేను రోజుల్లో ఇస్తాను అంటూ ఐదువేలతో మొదలు పెట్టి లక్ష రూపాయల వరకు కూడా వసూలు చేస్తున్న పరిస్థితి. ఒక్కసారి డబ్బులు ఇచ్చాక నెల రెండు నెలలు ఆరు నెలలు దాటుతున్నా.. యేడాది అవుతున్నా తిరిగి డబ్బులు ఇవ్వడం లేదు సరికదా… వారి ఫోన్లు కూడా ఎత్తని పరిస్థితి. దేవరపల్లి – గోపాలపురం మండలాల్లోనే ఏకంగా 20 మందికి పైగా పెద్ద పెద్ద బాధితులు ఉన్నారు. ఆమె తీయని మాటలకు పడిపోయి భారీగా సమర్పించుకున్న పార్టీ నేతలు అందరూ ఇప్పుడు కక్కలేక.. మింగలేకా తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో తెలియక సతమతమవుతోన్న పరిస్థితి. ఇక ద్వారకాతిరుమల మండలంలోనూ బాధితుల సంఖ్య భారీగా ఉంది. ఆమెకు భారీగానే సమర్పించుకున్న పార్టీ నేతలు ఇప్పుడు ఎవరికి చెప్పుకోవాలో తెలియక.. లబోదిబో మంటున్నారు.స్థానిక ప్రజాప్రతినిధి ఎన్నికలకు ముందే పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్‌గా ఉంటోందన్న ఉద్దేశంతో ఆమెకు పార్టీలో ఓ పదవి కల్పించారు. ఆ పదవి అడ్డం పెట్టుకుని ఇతర నియోజకవర్గాలకు చెందిన నాయకులతో కూడా పరిచయాలు పెంచుకుని.. వారికి కూడా తీయని కల్లిబొల్లి కబుర్లు చెపుతూ వారి దగ్గర నుంచి కూడా పెద్ద మొత్తాల్లో గుంజుతోందట. ఆమె వసూళ్ల వ్యవహారం ఆ నోటా ఈ నోటా చుట్టు పక్కల మూడు, నాలుగు నియోజకవర్గాలకు పాకేసింది. దీంతో ఆమె తీరు ఇదా అని అందరూ నోరెళ్ల బెడుతున్నారు.

సదరు మహిళా నేత వసూళ్ల దందాతో విసిగిపోయిన గోపాలపురం, దేవరపల్లి మండలాల పార్టీ నాయకులు ఆమెను ఇప్పటికే పక్కన పెట్టేశారు. పార్టీ కార్యక్రమాలకు కూడా పిలవడం లేదు. ఈ విషయం నియోజకవర్గ ప్రజా ప్రతినిధి దృష్టికి వెళ్లడంతో జాగ్రత్తగా ఉండాలని స్థానిక నాయకులకు చెప్పేసినట్టు తెలుస్తోంది. ఆయన సూచనతోనే ఆ మహిళా నేతను పార్టీ నాయకులు పట్టించుకోవడం మానేశారని టాక్ ? ఆ మహిళా నేత విషయంలో పార్టీ నేతలు.. సామాన్యులు జాగ్రత్తగా ఉండకపోతే వాళ్ల జేబులు గుల్లచేయడం ఖాయమన్న చర్చలు ఇప్పుడు నియోజకవర్గంలో గట్టిగా వినిపిస్తున్నాయి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular