దొంగలను పట్టుకోవాలి అనుకుంటున్నారు పెద్ద ఆపరేషన్ లాగా క్రియేట్ చేసి యూట్యూబ్లో వ్యూస్ పెంచుకోవాలనుకున్నారు అవతల పక్క ఉన్నవాళ్లు మోసగాళ్లే మరి యూట్యూబ్ న్యూస్ కోసం వాళ్ళని పట్టుకోవాలంటే పోలీసులకు సమాచారం ఇచ్చి పోలీసుల సహకారంతో పట్టుకోవడం అనేది లీగల్ కానీ ఎథికల్ హ్యాకర్ అని చెప్పబడే అరవింద్ అనుచరులు పోలీసుల అడ్రస్ వేసుకొని నాలుగు కాళ్లలో ఆ ముఠా వ్యవహారం తెలుసుకుని అక్కడికి వెళ్లి నకిలీ తుపాకుల కాల్పులు జరిపి హంగామా సృష్టించి మొత్తం వీడియో తీసుకున్నాడు అక్కడ జరిగిన హంగామా చూసి భయపడిన స్థానికులు పోలీసులు సమాచారం ఇస్తే వెల్లడైన వాస్తవాలు ఇవే…
అన్నమయ్య జిల్లా షికారీపాలెంకు చెందిన పోమర్ బంగారీ, రాణా హరీశ్, రాణా బాబురావు, పోమర్ విలాస్ అమాయకులకు నకిలీ బంగారాన్ని అంటగట్టి మోసగిస్తుంటారు. వీరు తెలంగాణలోని జనగామ జిల్లా మానసానపల్లి గ్రామానికి చెందిన నరేశ్‌కు ఇలాగే ఎరవేశారు. ఇదొక ముఠా నకిలీ బంగారం ముఠాగా గుర్తించిన అతను హైదరాబాద్‌కు చెందిన యూట్యూబర్ పులి అరవింద్ కుమార్‌కు తెలిపాడు. సైబర్ క్రైమ్‌లో ఎథికల్ హ్యాకర్ అయిన అరవింద్ తన సహాయకులతో కలసి షికారీపాలెం ముఠాను పట్టుకునేందుకు పథకం వేశాడు. తమ ఛానల్‌లో అప్‌లోడ్ చేసేందుకు, ఆ ముఠాను పట్టుకునే దృశ్యాలను చిత్రీకరించాలని పథకం వేశారు.
రెండు బొమ్మ తుపాకులను సమకూర్చుకుని రెండు కార్లలో అన్నమయ్య జిల్లా రామాపురం చేరుకున్నారు. షికారీపాలెం ముఠా నకిలీ బంగారంతో అక్కడకు వచ్చింది. అరవింద్ బృందంలోనివారు పోలీసుల మాదిరిగా సఫారీ దుస్తుల్లో కనిపించడం, కెమెరాలతో చిత్రీకరిస్తుండడంతో భయపడిన బంగారం ముఠా అక్కడి నుంచి పరారవడానికి ప్రయత్నించగా, అరవింద్ బృందం బొమ్మ తుపాకులతో కాల్పులు జరిపింది. తీవ్ర ఆందోళన చెందిన స్థానికులు ఠాణాకు సమాచారమివ్వగా, బత్తలపల్లి పోలీసులు అక్కడకు చేరుకున్నారు. టోల్‌గేట్ ద్వారా వాహనం నంబరు, ఫోన్ నంబరు సంపాదించి కాల్ చేయగా, తాము తెలంగాణ పోలీసులమని చెప్పిన అరవింద్ బృందం ఆ తర్వాత ఫోన్ స్విచాఫ్ చేసుకుంది. క్షుణ్నంగా దర్యాప్తు జరిపిన పోలీసులు ఎట్టకేలకు నిందితులను అరెస్టు చేశారు.పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు