spot_img
Monday, July 21, 2025
spot_img

టెలికాం రెగులేటర్ అథారిటీ ఆఫ్ ఇండియా కొత్త రూల్స్‌ని ప్రకారం నవంబర్ నుంచి OTPలు రావు

టెలికాం రెగులేటర్ అథారిటీ ఆఫ్ ఇండియా కొత్త రూల్స్‌ని ప్రవేశపెట్టనుంది. ఈ రూల్స్ కారణంగా నవంబర్ 1 నుంచి OTPలు వచ్చే అవకాశం ఉండదు. ట్రాయ్ కొత్త నిబంధన ప్రకారం బ్యాంకులు, ఈ-కామర్స్ వెబ్‌సైట్లు, ఇతర ఆర్థిక సంస్థలు పంపించే సందేశాలను ట్రాక్ చేయడం కుదరదు.ఈ నిబంధనలు నవంబర్ 1 నుండి అమల్లోకి వస్తాయ. ఈ నిబంధనలు స్పామ్‌ను నివారించడం, సందేశాల పారదర్శకత నిర్ధారించాడానికి మాత్రమే వర్తిస్తాయి. ఒక సందేశం మిస్‌మ్యాచ్ అయినా.. లేదా నిషేధించబడిన టెలిమార్కెటర్ చెయిన్‌లో ఉంటే దానిని బ్లాక్ చేయాల్సి ఉంటుంది.
దీని వల్ల వన్-టైమ్ పాస్‌వర్డ్‌లు (OTPs) వంటి ముఖ్యమైన సందేశాలకు అంతరాయం ఏర్పడవచ్చు. ఎందుకంటే టెలిమార్కెటర్లు, వ్యాపారాలు సాంకేతిక పరిష్కారాలను పూర్తిగా అమలు చేయడానికి సిద్ధంగా లేరు.

భారత సెల్యులర్ ఆపరేటర్స్ అసోసియేషన్ (COAI) – Airtel, Vodafone, Reliance Jio వంటి ప్రధాన సంస్థలు కొన్ని నిబంధనలను సడలించాలని ట్రాయ్‌ని కోరాయి. ఎందుకంటే ముఖ్యమైన సందేశాలు వినియోగదారులకు చేరకుండా ఉండే అవకాశం ఉంది.
టెలికాం కంపెనీలు ముఖ్యమైన సందేశాలు వినియోగదారులకు అందకపోవడం వల్ల అసౌకర్యం ఏర్పడుతుందని హెచ్చరించారు.ట్రాయ్ కొత్త టెలికాం చట్టం 2023 కింద నెట్‌వర్క్ అనుమతులపై చర్చాపత్రాన్ని విడుదల చేసింది. ఈ చర్చలో టెలికాం నెట్‌వర్క్‌ల ఏర్పాటు, నిర్వహణ లేదా విస్తరణ కోసం తగిన ఫీజులు, షరతులపై మంత్రిత్వ శాఖ అభిప్రాయాలు ఇవ్వాలని కోరింది. దీంతో పాటు శాటిలైట్ కమ్యూనికేషన్ నెట్‌వర్క్ కోసం ట్రాయ్ అనుమతులను పరిశీలించాలని డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT) కోరింది. ఈ మార్పులతో టెలికాం రంగం సవాళ్లను ఎదుర్కొంటూ.. మెసేజ్ ట్రేసబిలిటీని మెరుగుపరిచే విధానాలను అమలు చేయాలని చూస్తోంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular