spot_img
Monday, July 21, 2025
spot_img

అందర్నీ ముంచుతున్న యాప్.. పొరపాటున దీన్ని ఇన్‌స్టాల్ చేశారో..జర భద్రం గురూ

డిజిటల్ మోసాలు జరుగుతున్నాయి. హ్యాకర్లు మనల్ని మోసగించడానికి కొత్త మార్గాలను కనుక్కుంటున్నారు. అలాంటి మోసాలలో ఒకటి “లాంజ్ పాస్” అనే ఓ యాప్ ద్వారా జరుగుతుంది. అని సైబర్ ఎక్స్పోర్ట్ లు హెచ్చరిస్తున్నారు.లాంజ్ పాస్ కోసం చాలామంది ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటున్నారు. కానీ ఈ యాప్‌లో హానికరమైన కోడ్‌ను హ్యాకర్లుబ్యాక్ గ్రౌండ్ లో రన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ అప్లికేషన్ ఉపయోగించే వారి బ్యాంకు అకౌంట్ నుంచి డబ్బును హ్యాకర్లు దొంగలిస్తున్నారు. ఇలాంటి సమస్య గురించి సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.

క్లౌడ్‌సెక్‌కు చెందిన థ్రెట్ రీసెర్చ్ టీమ్ ఈ లాంజ్ పాస్ యాప్ పై తాజాగా దృష్టి సారించింది. వారు దీనిని బాగా పరిశీలించి దీనంత డేంజరస్ యాప్ మరొకటి లేదు అని హెచ్చరించారు.

ఈ అప్లికేషన్ ఎక్కువగా భారతీయ విమానాశ్రయాలలో విమాన ప్రయాణికులను టార్గెట్ చేస్తుందని ఆ టీమ్‌ సభ్యులు పేర్కొన్నారు. loungepass.in వంటి హానికరమైన వెబ్‌సైట్లలో ఈ అప్లికేషన్ ని ఉంచుతున్నారు అని తెలుస్తోంది.మోసగాళ్లు ఈ అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకున్న వారి ఫోన్ నెంబర్‌కు వచ్చే కాల్స్, ఎస్ఎంఎస్‌లు తమ ఫోన్ నెంబర్ కి మళ్ళించుకుంటున్నారు. ఈ యాప్ ఎస్ఎంఎస్, ఫోన్ కాల్ పర్మిషన్స్ తీసుకుంటుంది.

తద్వారా సైబర్ క్రిమినల్ కంట్రోల్ సర్వర్లకి యూజర్ల ఫోన్ కాల్స్, ఎస్ఎంఎస్‌లు వచ్చేలాగా వీళ్ళు చేస్తున్నారు. తన ఫోన్‌లో కాల్ ఫార్వార్డింగ్ చేసి, తన ఫోన్‌ను కంట్రోల్ చేస్తున్నారు. బ్యాంక్ అకౌంట్స్ లోని డీటెయిల్స్ తెలుసుకొని ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. సైబర్ సెక్యూరిటీ నిపుణులు రివర్స్ ఇంజనీరింగ్ చేసి మరీ ఈ అప్లికేషన్ ఎలా యూజర్లను మోసం చేస్తుందో తెలుసుకున్నారు. ఈ అప్లికేషన్ ఒకటే కాకుండా పెద్దగా తెలియని యాప్స్ ఇన్‌స్టాల్ చేసుకోవద్దని యూజర్లను సైబర్ సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్స్ హెచ్చరిస్తున్నారు తస్మాత్ జాగ్రత్త

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular